Statue of Equality: సమతామూర్తిని సందర్శించాలంటే టికెట్టు కొనాల్సిందే..
Statue of Equality: తెలంగాణ ముచ్చింతల్‌లో రూ.1200 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకున్న రామానుజుల విగ్రహాన్ని సందర్శించాలంటే టిక్కెట్టు కొనాల్సిందే.. 120 కిలోల బరువుతో 54 అడుగుల ఎత్తు ఉన్న ఆ స్వర్ణమూర్తి ధగధగా మెరిసిపోతున్నారు. ఆలయ ప్రాంగణంలో 108 వైష్ణవ ప్రధాన ఆలయాలు నిర్మించారు. ఈ క్షేత్ర నిర్వహణలో ఎన్నో ప్రత్యేకతలు.
మరి అలాంటి మూర్తిని దర్శించి పర్యాటకులు అంతులేని అనుభూతికి గురవతున్నారు. ఈ క్రమంలో మూర్తిని దర్శించేందుకు టికెట్టు పెట్టాలని నిర్ణయించారు క్షేత్ర అధికారులు. తొలుత పెద్దలకు రూ.500, చిన్నారులకు రూ.200 అని భావించారు. కానీ అది భక్తులకు భారం అవుతుందని భావించి పెద్దలకు రూ.150, చిన్నారులకు రూ.75 ఖరారు చేశారు. మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో ఈ మేరకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఈ స్వర్ణమూర్తికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. విగ్రహానికి 6 నుంచి 8 అడుగుల దూరంలో బుల్లెట్‌ఫ్రూఫ్ గ్లాస్ ఫ్రేమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది పూర్తయిన తరువాతే పర్యాటకులను అనుమతిస్తారు. ఇంకా ఇక్కడ రక్షణ సిబ్బంది 24 గంటలు పహారాలో ఉంటారు. రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి ఆరున్నవరకు అనుమతి ఉంటుంది. మరో నెలరోజుల్లో పనులు పూర్తవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు.
50 ఎకరాల్లో నెలకొల్పిన ఈ క్షేత్రాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు రెండు షిప్టుల్లో 300 మంది భద్రతా సిబ్బంది పని చేస్తున్నారు. క్షేత్రంలో ఉన్న 108ఆలయాల్లో అర్చకులను నియమించనున్నారు. ఒక్కో ఆలయానికి ఇద్దరు చొప్పున దాదాపు 250 మంది అర్చకులను నియమించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com