chakrasnanam : తిరుమల బ్రహ్మోత్సవాలు... శ్రీవారికి వైభవంగా చక్రస్నానం..!
chakrasnanam : తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు శ్రీమలయప్పస్వామి దేవరులతో కలిసి సర్వభూపాల వాహనంపై కొలువుదీరిన శ్రీవారికి... ఇవాళ చక్రస్నానం నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల శ్రీవారి బ్రహోత్సవాల్లో చక్రస్నానం కీలక ఘట్టం. రాత్రి జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ... గురువారం రాత్రి శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కుటుంబసమేతంగా ఎన్వీ రమణ ... అశ్వవాహన సేవలో పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాతో కలిసి ఇవాళ చక్రస్నానం మహోత్సవంలో పాల్గొన్నారు
కరోనా కారణంగా బ్రహోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాల్సి వచ్చినా, శాస్త్రబద్ధంగా ఘనంగా జరిపించామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఎస్వీబీసీ, ఇరత ఛానల్స్ ద్వారా దేశ వ్యాప్తంగా భక్తులు బ్రహ్మోత్సవాలను తలకించారన్నారు. ఆన్ లైన్‌లోనే కాకుండా తిరుపతి కాలినడక మార్గంలో టికెట్ల కేటాయింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com