Tirupati: అంబరాన్నంటిన గంగమ్మ జాతర సంబరాలు

Tirupati: అంబరాన్నంటిన గంగమ్మ జాతర సంబరాలు
X
తిరుపతిలో గంగమ్మ జాతర సందడి మిన్నంటింది. చాటింపుతో ప్రారంభమైన ఈ జాతర వారం రోజుల పాటు కొనసాగనుంది

తిరుపతిలో గంగమ్మ జాతర సందడి మిన్నంటింది. చాటింపుతో ప్రారంభమైన ఈ జాతర వారం రోజుల పాటు కొనసాగనుంది. జాతర నేపథ్యంలో గ్రామస్థులు ఊరును విడిచి వెళ్లరాదని చాటింపు వేశారు. బైరాగి వేషంలో భక్తులు మొక్కులు సమర్పించుకుంటున్నారు. వారం రోజుల పాటు రోజుకో వేషధారణలో భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఆడవారు మగవారి వేషంలో.. మగవారు ఆడవారి వేషంలో ఆలయానికి చేరుకుంటున్నారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెల్లెలిగా గంగమ్మ తల్లి ప్రసిద్ధి. ఈ జాతరను రాష్ట్ర పండుగగా మొదటిసారి ప్రభుత్వం ప్రకటించింది.

Tags

Next Story