Horoscope Today : ఈ రాశివారికి వ్యవహారాలలో విజయం, శుభవార్తలు..!

Horoscope Today : ఈ రాశివారికి  వ్యవహారాలలో విజయం,  శుభవార్తలు..!
ప్రయాణాల్లో మార్పులు. వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. పనులు మందగిస్తాయి. బంధువులను కలుసుకుంటారు.

మేషం: కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ధనవ్యయం. అనారోగ్యం. బంధువుల తాకిడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆస్తుల వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. దూరప్రయాణాలు ఉంటాయి.

వృషభం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆహ్వానాలు రాగలవు. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధన, వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి.

మిథునం: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. కార్యక్రమాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు.బంధువులతో తగాదాలు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు ఉంటాయి.

కర్కాటకం: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. విందులువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం.

సింహం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. ర్యక్రమాలలో ఆటంకాలు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా. రాబడి నిరాశ కలిగిస్తుంది.

కన్య: మీ ఆశయాలు నెరవేరతాయి. పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభం.

తుల: ప్రయాణాల్లో మార్పులు. వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. పనులు మందగిస్తాయి. బంధువులను కలుసుకుంటారు. ధనవ్యయం. కొత్త వ్యక్తులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.

వృశ్చికం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. దనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు ఉంటాయి. దైవదర్శనాలు. రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ధనుస్సు: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన. వాహనయోగం. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. మీ అంచనాలు నిజమవుతాయి.

మకరం: కుటుంబసభ్యలతో విభేదాలు. దైవచింతన. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. విద్యార్థులకు శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. పనులు ముందుకు సాగవు. బంధువులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ఆలయాలు సందర్శిస్తారు.

కుంభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి కుటుంబసౌఖ్యం .పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి.

మీనం: పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. ఆకస్మిక ధనలాభం. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శ్రమ ఫలిస్తుంది. నూతన విద్య, ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

Tags

Read MoreRead Less
Next Story