15 Feb 2023 6:00 AM GMT

Home
 / 
భక్తి / TTD: నేడు టీటీడీ...

TTD: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం

3500 కోట్ల బడ్జెటుకు ఆమోదం

TTD: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం
X

టీటీడీ పాలకమండలి సమావేశం (బుధవారం) ఇవాళ కానుంది. 3500 కోట్ల బడ్జెటుకు ఆమోదం తెలపనుంది. మొత్తం 390 అంశాలతో బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. తిరుపతి జూ పార్క్ రోడ్డులో దేవలోక్ లో యాత్రికుల వసతి సముదాయాల నిర్మాణానికి 112 కోట్లు, ఉల్లందూర్ పేట లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి దాతల సాయంతో 16 కోట్లు, యానంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 3 కోట్లు కేటాయించనుంది టీటీడీ. ఇక లడ్డూ వితరణ కేంద్రం విస్తరణలో భాగంగా మరో ఐదు కౌంటర్లు నిర్మాణం పై నిర్ణయం తీసుకోనున్నారు. పోటు ఆధునికరణకు ఆమోదం తెలపనుంది. ముడి సరుకులు కొనుగోలుకి నిధులు కేటాయింపులు జరపడంతో.పలు ఇంజనీరింగ్ పనులకు టీటీడీ ఆమోదం తెలపనుంది. ఈ వార్షిక సంవత్సరంలో శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. ఏకంగా హుండీ ఆదాయం 1500 కోట్లకు చేరుకోనుంది.

Next Story