Hyderabad: భాగ్య నగరంలో ఘనంగా బోనాల పండుగ
బోనాల ఉత్సవాలు
Bonalu: హైదరాబాద్ నగరంలో బోనాల ఉత్సవాల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. గత ఏడాది కరోనా కారణం గా నిడారంభరంగా జరిగిన బోనాల వేడుకలు ఈ సారి ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.మత సామరస్యనికి ప్రతీక ఐన భాగ్యనగరం లో హిందువులు ,ముస్లింలు కలిసి ఘనOగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటున్నారు.ఇప్పటికే గోల్కొండ లో బోనాల సందడి జోరుగా సాగుతుంటే...రేపు సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు జరగనున్నాయి.లష్కర్ బోనాల పై టీవీ5 స్పెషల్ ఫోకస్.
తెలంగాణ సంస్కృతీ కి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండుగ సంబురాలు భాగ్య నగరం లో అంబరాన్ని అంటూతున్నాయి. అయితే నగరం లో జరుగుతున్న బోనాల వేడుకలు ఓ ఎత్తు ,లష్కర్ లో జరుగుతున్న బోనాల సంబురాలు మరో ఎత్తు. ఆషాఢ మాసం కావడం తో భాగ్యనగరం లో ఎక్కడ చూసినా బోనాల సందడి తో ఆద్యాత్మిక శోభ సంతరించుకుంది.
హైదరాబాద్ నగరం లో జరుగుతున్న బోనాల ఉత్సవాలలో లష్కర్ బోనాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. 1813 వ సంవత్సరం లో సికి0ద్రాబాద్ కు చెందిన సురిటి అప్పయ్య అనే భక్తుడు మద్యప్రదేశ్ లోని ఉజ్జయినీ మిలటరీ లో పనిచేస్తూ ఉండగా.... ఉజ్ఙయినీ లో కలరా వ్యాధి సోకి వేలాది మంది మృత్యు వాత పడ్డారు. అప్పుడు... అప్పయ్య ఉజ్జయినీ లోని మహాoకాళి అమ్మవారిని దర్శించుకుని , కలరా నుంచి ప్రజలను రక్షిస్తే సికిoద్రాబాద్ లో నిన్ను ప్రతిష్ఠి చేసి ,ఆలయం నిర్మించి పూజలు చేస్తామని ఉజ్జయినీ మహాoకాళీ అమ్మవారికి మొక్కు కున్నాడు.
అప్పుడు అమ్మవారి దయ తో కలరా నుంచి అనేక వేల మంది రక్షిoచబడ్డారని , 1815 లో సికిoద్రాబాద్ లో ఉజ్జయినీ మహాoకాళీ అమ్మవారి ని నెలకోల్పీ ప్రతి యేట ఆషాఢ మాసం లో బోనాల జాతర ఎంతో ఘనం గా జరుపుతున్నారు. సికింద్రబాద్ ఉజ్ఙయినీ మహాoకాళీ అమ్మ వారి బోనాల ఉత్సవాలకు ఈ నెల 11 ఆదివారం ఘటోత్సవం తో బోనాల ఉత్సవాలకు అoకురార్పణ జరిగింది. మొత్తం 15 రోజుల పాటు అమ్మవారు సికిoద్రాబాద్ పుర వీధుల లో భక్తూల ఇంటి దగ్గర కు వెళ్ళి దీవెనలు అందించింది.
అయితే జూలై 25 న సికిoద్రాబాద్ బోనాల వేడుక జరగనుంది.ఆదివారం తెల్లవారు జామున మూడున్నర గంటలకు...వేద మంత్ర ఉచ్చారణల తో ఆలయ ద్వారాలు తెరిచి,మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ముఖ్యమంత్రి KCR తో పాటు పలువురు మంత్రులు ,ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుOటారు. అంతే కాకుండా లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు.రాష్ట్ర పండుగ గా బోనాలను ప్రకటించి....తెలంగాణ ప్రభుత్వం యేడు 15 కోట్ల రూపాయల తో అన్ని ఏర్పాట్లు చేసిoది. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు... తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసారు.
పోలీసు శాఖ కూడా నగరం లో జరుగుతున్న సికింద్రాబాద్ బోనాల జాతర కు భారీ బందోబస్తూ ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాల తో నిఘా పెట్టింది. 26 తేదిన ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత ....ఉదయం 9 గంటలకు రంగo కార్యక్రమం లో స్వర్ణ లత అనే అవివాహిత మహిళ అమ్మవారికి ఆభిముఖ0 గా పచ్చి కుండ పై నిలబడి భవిష్య వాణీ చెబుతుంది.
అనంతరం అమ్మవారు గజ రొహనం ,ఫలహరల బండ్ల ఊరేగింపు తో లష్కర్ లో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. మొత్తం మీద పోతూ రాజుల విన్యాసాలు ,శివ సతుల పునకాల తో భాగ్య నగరం పల్లె ను తలపింస్తుంది.
దార.సత్యనారాయణ.
Tv5 సీనియర్ కరస్పాండెంట్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com