శ్రీకాళహస్తిలో స్వామి అమ్మవార్లకు వైభవంగా ఉంజల్ సేవ

శ్రీకాళహస్తిలో స్వామి అమ్మవార్లకు వైభవంగా ఉంజల్ సేవ
దాతలు ఇచ్చిన వెండి ఊయలపై స్వామి అమ్మవార్లకు ఉంజల్ సేవ నిర్వహించారు.

శ్రీకాళహస్తి దేవస్థానంలో దాదాపు తొమ్మిది నెలల తర్వాత స్వామి అమ్మవార్లకు ఉంజల్ సేవ నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకొని వెండి ఉయ్యాలపై శ్రీకాళహస్తి స్వామి తన దేవేరులతో ఊయలలు ఊగగా.. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ధూప దీప నైవేద్యాలతో స్వామివారికి కర్పూర హారతులు అందజేశారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఉంజల్‌ సేవ నిర్వహించడంతో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉంజల్ సేవలో దాతలు ఇచ్చిన వెండి ఊయలపై స్వామి అమ్మవార్లకు ఉంజల్ సేవ నిర్వహించారు.


Tags

Next Story