Sri Bugul Venkateswara Swamy Temple: ఆర్థిక ఇబ్బందులు తొలగే అవకాశం.. గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనతో..

Sri Bugul Venkateswara Swamy Temple: చాలీ చాలని జీతం.. అప్పు చేయనిదే గడవని వైనం. అప్పు చేయడం సరే తీరే మార్గం ఏది.. ఆ ఆపద మొక్కుల వాడు ఆదుకుంటే ఏమైనా సాధ్యమవుతుందేమో అని ఆశ పడుతుంటారు సగటు మధ్యతరగతి జీవులు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు అప్పులు చేయడానికి కారణమవుతుంటాయి. అప్పుల సమస్యతో బాధపడేవారు గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతుంటారు స్వామిని దర్శించిన భక్తులు.
మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది.. ఆలయ విశేషాలు తెలుసుకుందాం..
హైదరాబాద్ వరంగల్ హైవే చిల్పూరు గుట్టలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి గూగుల్ వెంకటేశ్వర స్వామి ఆలయం అని కూడా పేరు. ఈ ఆలయంలోని స్వామి వారిని దర్శిస్తే ఆర్థిక బాధలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆలయంలో ఉన్న అఖండ దీపంలో నూనె వేసి దీపం వెలిగిస్తే రుణ బాధలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
మన అవసరానికి అప్పులు చేసి దేవుడు తీరుస్తాడని ఆయన మీద భారం వేస్తే ఎలా తీరుతాయని కొంతమందికి ఆలోచన కలుగుతుంది. పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి తన వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం కోసం కుబేరుని వద్ద అప్పు తీసుకుంటారు. అయితే ఆయన కూడా తాను చేసిన అప్పులు తీరే మార్గం ఏమిటా అని ఆలోచిస్తూ గుబులుగా ఉంటారు. ఆ బాధలోనే చిల్పూరు గుట్టకు వచ్చి అక్కడ గుహలో తపస్సు చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఆ విధంగా అక్కడ వెలసిన వెంకటేశ్వరునికి గుబులు వెంకటేశ్వరుడని పేరు. కొండ కింది భాగంలో స్వామివారి పాదాల గుర్తులు ఏర్పడ్డాయి. ఈ విధంగా స్వామివారి పాదాలు ఉన్న చోటును పాదాల గుండు అని పిలుస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com