వినాయకుని నుండి మనం ఏ నాయకత్వ లక్షణాలను నేర్చుకోవచ్చు?

వినాయకుని నుండి మనం ఏ నాయకత్వ లక్షణాలను నేర్చుకోవచ్చు?
వినాయకుని రూపం చూడగానే నవ్వు తెప్పించేదిగా ఉన్నా.. ఎందుకో ఆయన్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవాలనిపిస్తుంది.

వినాయకుని రూపం చూడగానే నవ్వు తెప్పించేదిగా ఉన్నా.. ఎందుకో ఆయన్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవాలనిపిస్తుంది. వింతగా, విచిత్రంగా ఉన్నా వినయంతో నమస్కరించాలనిపిస్తుంది. ఆ రూపం అపురూపం.. మంగళ ప్రదం.

అద్భుతమైన రూపంతో అలరారే గణేశుడి ప్రతి శరీర భాగం వృత్తిపరమైన జీవిత సవాళ్లను అధిగమించడానికి అవసరమైన విజయ సూత్రాలను అందిస్తుంది.

'మంగళమూర్తి' గా ప్రసిద్ధి చెందిన వినాయకుడు వృత్తిపరమైన జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని ఏకకాలంలో రాణించడానికి కీలకమైన వ్యక్తిగా నిలుస్తాడు. సమస్యలను పరిష్కరించే వాడిగా భక్తుల తొలి పూజలందుకుంటారు. అడ్డంకులను తొలగించమంటూ ఆ విఘ్ననాయకుడిని వేడుకుంటాము. ఆయన పేరు జపిస్తూ, పూజలు చేస్తూ భక్తులు కొత్త ప్రయత్నాలు మొదలుపెడతారు, జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.

వృత్తి జీవితం విజయవంతం కావడానికి పాటించాల్సిన ముఖ్యమైన లక్షణాలను గణేషుడిని చూసి నేర్చుకుందాం..

పెద్ద తల (విస్తృత ఆలోచనా జ్ఞానం)

వినాయకుని పెద్ద తల జ్ఞానంతో నిండిన ఆలోచనలను సూచిస్తుంది. కాబట్టి ఒక నాయకుడు జీవితంలో విజయం సాధించాలంటే విశాలంగా ఆలోచించాలి.

చిన్న కళ్ళు (సూక్ష్మ దృష్టి)

వినాయకుని చిన్న కళ్ళు పనిని పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నాయి. అలాగే, సూక్ష్మ దృష్టిని సూచిస్తుంది. అంటే సూక్ష్మంగా గమనించగల సామర్థ్యంతో పాటు సరైన దృష్టి విధానం విజయానికి మెట్లు.

పెద్ద చెవులు (ఎక్కువగా వినాలి)

పెద్ద చెవులు ఎక్కువగా వినడానికి ప్రాధాన్యతనివ్వాలని తెలియజేస్తాయి. మంచి వక్త, మేనేజర్ లేదా నాయకుడు కావాలంటే ముందు ఇతరులు చెప్పింది వినాలి. అప్పుడే సమర్థవంతమైన నాయకుడు అనిపించుకుంటాడు.

తొండం (జాగ్రత్త)

పొడవైన ముక్కు లేదా ట్రంక్ ఎల్లప్పుడూ చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. అలాగే, ఒక మంచి నాయకుడు కూడా చాలా దూరం నుండి వాసన పసిగట్టగలగాలి అంటే భవిష్యత్తును పసిగట్టగలగాలి.. దాని కోసం సంసిద్ధంగా ఉండాలి.

పెద్ద పొట్ట (ప్రతిదీ గ్రహించాలి)

పెద్ద పొట్ట త్వరగా జీర్ణించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో మంచి, చెడు రెండూ ఉంటాయి. కాబట్టి, మంచి నాయకుడు ఎప్పుడూ వైఫల్యాలతో నిరుత్సాహపడకూడదు, అలానే విజయాలతో సంతోషించకూడదు. దృఢ సంకల్పం కలిగిన వ్యక్తిగా నిలకడగా ఉండాలి.

విరిగిన దంతం (త్యాగం)

విరిగిన దంతం త్యాగం యొక్క శక్తిని సూచిస్తుంది. చాలా సార్లు భావోద్వేగాలను అధిగమించి తెలివిగా వ్యవహరించాలి. అలాగే, ఎలాంటి స్వార్థపూరిత ఉద్దేశాలు లేకుండా ఇతరులతో వ్యవహరించాల్సి ఉంటుంది.

కాబట్టి గణేష్ చతుర్థి సందర్భంగా ప్రియమైన దైవత్వం నుండి ఆదర్శప్రాయమైన నాయకత్వ లక్షణాలను నేర్చుకుందాం.

Tags

Read MoreRead Less
Next Story