వినాయక విజయంలో వినాయకుడిగా నటించిన బాల నటి ఎవరో తెలుసా..

టెక్నాలజీ లేకపోయినా అద్భుతమైన చిత్రాలు తీసి అలరించారు ఆ తరం దర్శకులు. అందుకే ఇప్పటికీ ఆ చిత్రాలు టీవీల్లో వస్తే చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. పాత చిత్రాలు, పాటలు అన్నీ ఆణిముత్యాలు.. సందర్భానుసారంగా ఆ చిత్రాలను వేస్తుంటాయి వివిధ చానెల్స్. ప్రస్తుత వినాయకచవితి సందర్భాన్ని పురస్కరించుకుని వస్తున్న వినాయవిజయం దర్శకుడు కమలాకర కామేశ్వరరావు తెరకెక్కించారు.
ఈ చిత్రంలో కృష్ణంరాజు, వాణిశ్రీ శివపార్వతులుగా నటించారు. ఈ చిత్రంలో వినాయకుని జన్మ వృత్తాంతం వివరించే ప్రయత్నం చేశారు. దేవులపల్లి పాటకు సాలూరి స్వరాలు తోడవగా సుశీలమ్మ పాడిన 'ఎవరయ్యా.. ఎవరయ్యా' అంటూ సాగే పాట పండగ పూట టీవీల్లో మార్మోగిపోతుంటుంది. అయితే వినాయకుడి గెటప్‌లో అలరించిన చిన్నారి ఎవరా అని ఆరా తీయగా..
భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వినాయక విజయం చిత్రంలో బాల గణేషుడిగా కనిపించింది బేబీ లక్ష్మీ సుధ. ఇక పెద్దయ్యాక వినాయకుడి గెటప్‌లో కనిపించింది ఎంజీవీ మదన్ గోపాల్ అనే ఆర్టిస్టు అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com