Hanuman Puja: హనుమంతుడిని మంగళవారం మాత్రమే ఎందుకు పూజించాలి?
Hanuman Puja: మంగళవారం నాడు హనుమంతుడిని పూజించడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి..అయితే పూజా సమయంలో, పాటించవలసిన కొన్ని నియమాలను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఏదైనా చిన్న పొరపాటు జరిగినా చేసిన ఆరాధన అసంపూర్ణంగా మారుతుంది.
హిందూ మతంలో, వారంలో ఏడు రోజులు ఏదో ఒక దేవతకు అంకితం చేస్తారు. అలాగే మంగళవారాన్ని హనుమాన్ జీ రోజుగా పరిగణిస్తారు. మంగళవారం నాడు హనుమంతుడిని పూజించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని చెబుతారు. హనుమంతుని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఈ రోజు ఉపవాసం ఉంటారు.
హనుమంతుడిని మంగళవారం మాత్రమే ఎందుకు పూజించాలి వంటి విషయాలతో పాటు ఉపవాస నియమాలను తెలుసుకుందాము..
మంగళవారం ఉపవాసం ఎప్పుడు ప్రారంభించాలి..
శాస్త్రాల ప్రకారం, మీరు ఏ నెలలోనైనా శుక్ల పక్షం మొదటి మంగళవారం నుండి ఈ ఉపవాసాన్ని ప్రారంభించవచ్చు. మీ ఇష్టానుసారం లేదా మీ ఓపికను బట్టి ఈ ఉపవాసం 21 లేదా 45 మంగళవారాలు చేయాలి. ఉపవాసం పూర్తయిన తర్వాత మీ జీవితంలో జరిగే అద్భుత పరిణామాలు చూడవచ్చు.
భక్తితో నియమ నిష్టలతో హనుమంతుని ప్రార్థించాలి. ఆ అంజనాసుతుడు అడిగిన వారికి లేదనకుండా కోర్కెలు నెరవేరుస్తాడు. అయితే ఆ కోర్కెలు నెరవేరేందుకు తాము కష్టపడుతూ భగవంతుని తోడ్పాడు కావాలని ప్రార్థించాలి. అంతేకానీ మొత్తం భారం భగవంతుని మీద వేసి పూజ, ఉపవాసం ఉంటే సరిపోదు.. తమ వంతు ప్రయత్నం చేయాలి. అప్పుడే హనుమంతుడు సంతుష్టుడు అవుతాడు.
మంగళవారం ఉపవాస సమయంలో గుర్తుంచుకోవాల్సిన నియమాలు..
మీరు మంగళవారం ఉపవాసం ఉన్నట్లయితే, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, ప్రశాంతమైన మనస్సుతో హనుమంతుడిని పూజించడం చాలా ముఖ్యం.
ఉపవాస సమయంలో హనుమాన్ చాలీసా పఠించాలి. ఉపవాస సమయంలో ఉప్పు తీసుకోకూడదు. ఉపవాసాన్ని విరమించే ముందు తీపి పదార్థం తీసుకోవాలి.
మంగళవారం నాడు తీపి పదార్థాలను దానం చేయడం వల్ల బాధల నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మంగళవారం ఉపవాసం పాటించే వ్యక్తి రోజులో ఒక్కసారే భోజనం చేయాలి.
మంగళవారం నాడు ఎవరికీ రుణం ఇవ్వకూడదు. మంగళవారం ఇచ్చిన అప్పు అంత తేలికగా తిరిగి రాదని అంటారు. అయితే మీరు ఎవరి వద్దనైనా రుణం తీసుకున్నట్లయితే, మీరు దానిని మంగళవారం తిరిగి ఇవ్వవచ్చు.
మీరు మంగళవారం ఉపవాసం ఉంటే, ఈ రోజున ఏ కారణం చేతనైనా కోపం తెచ్చుకోకూడదు. ఇతరులకు బాధకలిగించే పదాలు ఉపయోగించకూడదు. మంగళవారం నాడు ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండాలి. ఎందుకంటే ఇటువంటి పనుల వల్ల జీవిత పురోగతికి ఆటంకం ఏర్పడుతుంది.
మంగళవారం నాడు కుటుంబ సభ్యులతో కానీ లేదా స్నేహితులతో కానీ వివాదాలు పెట్టుకోకూడదు. మనసంతా హనుమంతుని మీద లగ్నం చేసి ప్రశాంత చిత్తంతో ప్రార్థించాలి. అప్పుడే మీరు, మీ చుట్టూ ఉన్న వారు మంచి ఆలోచనలు చేస్తారు.. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోగలుగుతారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com