వారణాశి క్షేత్రంలో కన్నులపండువగా శివపార్వతుల కల్యాణం..!

వారణాశి క్షేత్రంలో కన్నులపండువగా శివపార్వతుల కల్యాణం..!
టీవీ5 ఆధ్యాత్మిక జైత్రయాత్రలో నవ వసంతాన మహాముక్తి క్షేత్రంగా భాసిల్లుతున్న పరమశివుని ఆవాసం వారణాశి క్షేత్రంలో.. శివపార్వతుల కల్యాణం అద్భుతంగా జరిగింది.

టీవీ5 ఆధ్యాత్మిక జైత్రయాత్రలో నవ వసంతాన మహాముక్తి క్షేత్రంగా భాసిల్లుతున్న పరమశివుని ఆవాసం వారణాశి క్షేత్రంలో.. శివపార్వతుల కల్యాణం అద్భుతంగా జరిగింది. యావత్‌ భారతదేశం మురిసేలా.. హైందవ జాతి గర్వపడేలా.. ముల్లోకాలు మెరిసేలా.. ముక్కోటి దేవతలు మురిసేలా సకల దేవతల ఆశీస్సులతో గౌరీ శంకరుల సుమనోహర కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. . శాస్త్రోక్తంగా సాగిన ప్రతి ఘట్టం భక్తులకు మరపురాని, మరచిపోలేని ఆధ్యాత్మిక అనుభూతిని, అపార ఆనందాన్ని పొందేలా చేసింది.

ప్రతిహతంగా కొనసాగుతున్న టీవీ5 ఆధ్యాత్మిక జైత్రయాత్రలో నవ వసంతాన మహాముక్తి క్షేత్రంగా భాసిల్లుతున్న పరమశివుని ఆవాసం వారణాశి క్షేత్రంలో.. యావత్‌ భారతదేశం మురిసేలా.. హైందవ జాతి గర్వపడేలా.. ముల్లోకాలు మెరిసేలా.. ముక్కోటి దేవతలు మురిసేలా సకల దేవతల ఆశీస్సులతో గౌరీ శంకరుల సుమనోహర కళ్యాణం నేత్రపర్వంగా సాగింది..

రోజులపాటు రుద్రాభిషేకాలు, హోమాది క్రతువులు, సాయం సమయాన నిత్య కల్యాణాలు నిర్వహించగా.. తొమ్మిదవ రోజున శ్రీ శివపార్వతుల కళ్యాణాన్ని అత్యద్భుతంగా నిర్వహించింది టీవీ5. పటించినంత మాత్రాన్నే సర్వపాపాలను పటాపంచలు చేసే పంచాక్షరీ మంత్రంతో అస్సీఘాట్ ప్రాంగణమంతా మారుమోగి పోయింది.

మొదట కోటి దీపోత్సవ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో సాగింది. వారణాశి క్షేత్రంలోని అస్సీఘాట్‌లో కోటి దీపాలను వెలిగించి ఆ పరమశివునికి నీరాజనం సమర్పించారు.. టీవీ5, హిందూధర్మం ఛానెళ్ల ఎండీ రవీంద్రనాథ్‌ దంపతులు ద్వీప ప్రజ్వలన గావించారు.. అనంతరం భక్తులంతా కోటిదీపాలను వెలిగించారు.. కోటి దీప కాంతులతో అస్సీ ఘాట్‌ పరిసర ప్రాంతాల్లో వెలుగులు విరజిమ్మాయి.

అనంతరం సంగమేశ్వర ఆలయం నుంచి ఆది దంపతుల శోభాయాత్ర నిర్వహించారు.. శోభాయాత్ర సందర్బంగా అస్సీఘాట్‌ భక్తజన సందోహంగా మారింది.. ఇక శోభాయాత్ర ముగించుకుని వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులు వేదికమీదకు వేంచేశారు. ఆదిదంపతులను చూడగానే భక్తులంతా తన్మయత్వానికి లోనయ్యారు.

శోభాయాత్ర అనంతరం కళ్యాణ వేడుక కడు రమణీయంగా సాగింది. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివెళ్లిన భక్తులు... ఈ అద్భుతమైన ఘట్టాన్ని కన్నులారా వీక్షించి ధన్యులయ్యారు. అటు కాశీ క్షేత్రం నుంచి స్థానికులు వందలాదిగా తరలి వచ్చి.... . స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని వీక్షించారు.

అస్సీఘాట్‌, కళ్యాణ వేదిక.... భక్త జన సందోహంతో కిక్కిరిసిపోయింది. శివ నామస్మరణతో కళ్యాణ వేదిక ప్రాంగణం హోరెత్తింది. ఆదిదేవుడికి ఇష్టమైన పుష్పాలతో సమ్మోహనంగా వేదికపై ఆశీనులైన శివపార్వతులనూ చూసి తరించారు భక్తులు.

టీవీ5 ఆధ్వర్యంలో కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారిగా కాశీలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్లు కల్యాణం చూసేందుకు... పెద్ద సంఖ్యలు, పండితులు తరలివచ్చారు. టీవీ5 ఆధ్యాత్మిక జైత్రయాత్రకు వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులు ఆశీస్సులు అందజేశారు.



Tags

Read MoreRead Less
Next Story