4 March 2023 5:30 AM GMT

Home
 / 
భక్తి / Yadadri: యాదాద్రి...

Yadadri: యాదాద్రి బ్రహ్మెత్సవాలు సమాప్తం

కృష్ణశిలతో పునర్నిర్మితమయ్యాక.. ఆలయంలో తొలిసారి కొనసాగిన 11 రోజుల వేడుకలకు తెరపడింది

Yadadri: యాదాద్రి బ్రహ్మెత్సవాలు సమాప్తం
X

గర్భాలయంలోని మూలవరులకు శుక్రవారం ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రివేళ ప్రాకార మండపంలో డోలోత్సవం నిర్వహణతో యాదాద్రి పంచనారసింహుల ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. కృష్ణశిలతో పునర్నిర్మితమయ్యాక.. ఆలయంలో తొలిసారి కొనసాగిన 11 రోజుల వేడుకలకు తెరపడింది. ప్రధానాలయ మహాముఖ మండపంలో అష్టోత్తర కలశ ఆరాధన నిర్వహించి.. మూలవరులకు పంచామృతం, జలంతో అభిషేకం నిర్వహించారు. నేటి నుండి నిత్యోత్సవాలు మొదలవుతాయని ఆలయ అధికారులు తెలిపారు.

Next Story