Editorial: ఎల్‌బీ నగర్‌లో అసెంబ్లీ ఎన్నికలపై కన్నేసిన బీజేపీ కార్పొరేటర్లు...?

Editorial: ఎల్‌బీ నగర్‌లో అసెంబ్లీ ఎన్నికలపై కన్నేసిన బీజేపీ కార్పొరేటర్లు...?
ఎన్నికల బరిలో దిగేందుకు ముమ్మర ప్రయత్నాలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో గ్రేటర్ పరిథిలోని పలువురు కార్పొరేటర్లు అసెంబ్లీపై కన్నేశారు. తమ రాజకీయ భవిష్యత్‌ కోసం ఎన్నికల బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా 2020 GHMC ఎన్నికల్లో అనూహ్యంగా సత్తా చాటిన బీజేపీ నుంచి పలువురు కార్పొరేటర్లు ఎన్నికల బరిలో దిగేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. అప్పటి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 కార్పొరేటర్లు బీజేపీ తరపున విజయం సాధించి అధికార బీఆర్ఎస్‌కు సవాల్ విసిరింది. దీంతో ఆ పార్టీ కార్పొరేటర్లు గ్రేటర్ హైదరాబాద్ నుంచి అత్యధిక అసెంబ్లీ స్థానాలు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2020 డిసెంబర్ లో జరిగిన GHMC ఎన్నికల్లో LB నగర్ లో ఉన్న 11 డివిజన్లను బీజేపీ క్లిన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించింది. GHMC లో బీజేపీ కి ఉన్న కార్పొరేటర్ల లో 25 శాతం LB నగర్ నుంచే ఉండడం విశేషం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కువ కార్పోరేటర్లను గెలుచుకున్న LB నగర్ నియోజకవర్గం నుండి బరిలో దిగేందుకు కార్పొరేటర్లు ముందుకొస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మన్సురాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ రెడ్డి ఎల్‌బీ నగర్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. ఒక వైపు నియోజకవర్గ సమస్యల పై పోరాటం చేస్తూనే....మరో వైపు గ్రేటర్ హైదరాబాద్ సమస్యల పై కౌన్సిల్ లో గళమెత్తుతున్నారు.గతంలో 2009 నుంచి 2014 వరకు కొప్పుల నర్సింహ రెడ్డి భార్య కార్పొరేటర్ గా పని చేశారు. ప్రస్తుతం నర్సింహారెడ్డి కార్పొరేటర్ గా పని చేస్తున్నారు. నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ....పార్టీ పెద్దలతో టచ్ లో ఉంటున్న కొప్పుల నర్సింహారెడ్డి ఈ సారి ఎల్‌బీ నగర్ బీజేపీ టికెట్ తనకే అనే ధీమా లో ఉన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడైన....చంపాపేట కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి....LB నగర్ అసెంబ్లీ రేసులో ఉన్నానంటున్నారు. ఒక వైపు ఎల్‌బీ నగర్ సమస్యలపై నియోజకవర్గంలో , మరో వైపు గ్రేటర్ హైదరాబాద్ సమస్యలను జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ లో గళ మెత్తుతున్నారు. RSS బ్యాగ్రౌండ్ ఉన్న వంగా మధుసూదన్ రెడ్డి ...2016 లో స్వల్ప ఓట్ల తేడా తో చంపాపేట కార్పొరేటర్ గా ఓటమి పాలయ్యారు. 2020 డిసెంబర్ లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చంపాపేట కార్పొరేటర్ గా విజయం సాధించారు. బీజేపీ అధిష్టానం LB నగర్ టికెట్ తనకే కేటాయిస్తుందని మధుసూదన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వనస్థలిపురం కార్పొరేటర్ గా ఉన్న రాగుల .వేంకటేశ్వర రెడ్డి...LB నగర్ బీజేపీ టికెట్ బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈటల రాజేందర్ కు ప్రధాన అనుచరుడైన వెంకటేశ్వర రెడ్డి....LB నగర్ నియోజకవర్గంలో ఉన్న 500 కాలనీల JAC చైర్మన్ గా పని చేశారు. కాలనీల సమస్యల పట్ల అవగాహన ఉన్న వెంకటేశ్వర రెడ్డి .....LB నగర్ సమస్యల పై అలుపెరగని పోరాటం చేస్తున్నారు.బీజేపీ సీనియర్ నాయకులైన నల్లు ఇంద్రసేనారెడ్డి బావమరిది అయిన వెంకటేశ్వర రెడ్డి.....బీజేపీ పెద్దలకు టచ్ లో ఉంటూ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

చైతన్యపురి కార్పొరేటర్ ఉన్న రంగా నర్సింహ గుప్తా ....LB నగర్ టికెట్ రేసులో ఉన్నానంటూ హల్‌చల్ చేస్తున్నారు. గతంలో గడ్డి అన్నారం కార్పొరేటర్ గా రంగా నర్సింహ గుప్తా వదిన పని చేశారు. 2020 డిసెంబర్ లో జరిగిన GHMC ఎన్నికల్లో చైతన్యపురి కార్పొరేటర్ గా రంగా నర్సింహ గుప్తా విజయం సాధించారు.వివాదరహితుడిగా , సౌమ్యుడిగా పేరున్న తనకే ఎల్‌బీ నగర్ టికెట్ వస్తుందని నర్సింహ గుప్తా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం మీద LB నగర్ నియోజకవర్గ బీజేపీ టికెట్ కోసం నలుగురు కార్పొరేటర్లు పోటీ పడుతుండడం తో బీజేపీ అధిష్టానం కార్పొరేటర్లలో ఒకరికి టికెట్ ఇస్తుందా లేక వేరే వ్యక్తికి టికెట్ కేటాయిస్తుందా అని చర్చ నడుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story