ఎంపీ అవినాష్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!

ఎంపీ అవినాష్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి దగ్గర హై టెన్షన్‌ నెలకొంది.ఎంపీ అవినాష్‌ రెడ్డి అరెస్ట్ తప్పదన్న

కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి దగ్గర హై టెన్షన్‌ నెలకొంది.ఎంపీ అవినాష్‌ రెడ్డి అరెస్ట్ తప్పదన్న ఊహాగానాల నేపధ్యంలో విశ్వభారతి ఆసుపత్రికి చేరుకున్నారు సీబీఐ అధికారులు. అయితే ఆసుపత్రి ప్రధాన గేటుకి తాళం వేసి కాపల కాస్తున్నారు అవినాష్ వర్గీయులు.ఆసుపత్రి పరిసరాల్లో భారీగా మోహరించారు పోలీసులు. మరోవైపు మీడియా ప్రతినిధులపై దాడి చేసిన అవినాష్ అనుచరులు కెమెరాలు,సెల్ ఫోన్లు లాక్కుని దౌర్జన్యం చేయడంతో ప్రాణభయంతో పరుగులు తీశారు మీడియా ప్రతినిధులు. అయితే అక్కడే ఉన్న పోలీసులు మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోయారు.

అవినాష్‌ అరెస్ట్ తప్పదన్న వార్తల నేపధ్యంలో ఆసుపత్రి దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇక ఈనెల 19న తల్లి శ్రీలక్ష్మికి అనారోగ్యం కారణంగా కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే ఉంటున్నాడు అవినాష్ రెడ్డి.

మరోవైపు ఇవాళ విచారణకు హాజరు కావాలని సీబీఐ చెప్పినప్పటికీ.. విచారణకు రావడం కుదరదని తన తల్లి డిశ్చార్జ్‌ అయ్యాకే విచారణకు వస్తానని అవినాష్ రెడ్డి లేఖ రాశారు. అయితే అవినాష్ రెడ్డి లేఖపై సీబీఐ అధికారులు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ఉత్కంఠ రేపుతుంది.

Live Updates

  • 22 May 2023 1:40 PM GMT

    సీబీఐ ఏం చేయబోతోందనే ఉత్కంఠ

    లొంగిపోవాలని అవినాష్‌ రెడ్డికి చెప్పాలని  సీబీఐ అధికారులు ఎస్పీని కలిసిన సమయంలో చెప్పినట్లుగా పోలీసు వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.. శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ఆయన సీబీఐ బృందానికి చెప్పారు.. దీంతో వారు ఢిల్లీకి ఫోన్‌ చేసి సెంట్రల్‌ ఫోర్సెస్‌ పంపాలని సీబీఐ అధికారులు కోరినట్లుగా చెప్తున్నారు.. సెంట్రల్‌ ఫోర్సెస్‌ వస్తే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉండటం, లోకల్‌ పోలీసుల వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో కేంద్ర బలగాలకు బదులుగా జిల్లా పోలీస్‌ ఫోర్స్‌తోనే బందోబస్తు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు.. అటు ఇప్పటికే విశ్వభారతి ఆస్పత్రి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.. ఈ మొత్తం గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో సీబీఐ ఏం చేయబోతోందనే ఉత్కంఠ నెలకొంది.. అయితే, చీకటి పడిన తర్వాత అవినాష్‌ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  • 22 May 2023 12:45 PM GMT

    ఏపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి

    అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే తప్పుడు సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నట్లు ఉంటుందని తెలుస్తోంది. ఒక వేళ సీబీఐ అవినాష్ ను అరెస్టు చేస్తే, ఏపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా తీవ్రమైన నిర్ణయం తీసుకోవచ్చు.

  • 22 May 2023 12:21 PM GMT

    హాస్పిటల్ లైన్ లో ఎంపీ గోరంట్ల మాధవ్.

  • 22 May 2023 12:08 PM GMT

    చీకటి పడ్డాకే అవినాష్ రెడ్డి అరెస్ట్

    తీవ్ర విమర్శల నేపథ్యంలో వెనక్కు తగ్గుతున్న ఏపీ పోలీసులు. కేంద్ర బలగాలకు బదులుగా జిల్లా పోలీసు ఫోర్స్ తోనే బందోబస్తు కి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని ఆదోని,ఎమ్మిగనూరు, పత్తికొండ సబ్ డివిజన్ల నుంచి పోలీస్ ఫోర్స్ ని కర్నూలుకు రప్పిస్తున్న అధికారులు. జిల్లా పోలీస్ ఫోర్స్ వచ్చాక.. కట్టుదిట్టమైన భద్రత నడుమ..హాస్పిటల్ కు సీబీఐ అధికారులు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోకల్ పోలీసులు వస్తే కట్టడి చేయలేక పరిస్థితి చేయి దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీకటి పడ్డాకే అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

  • 22 May 2023 11:52 AM GMT

    విశ్వభారతి హాస్పిటల్ కు వైఎస్ విజయలక్ష్మి

    కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర హైటన్షన్. పోలీసు గెస్ట్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన సీబీఐ అధికారులు. ఏ క్ష్ణమైనా హాస్పిటల్ కు సీబీఐ అధికారులు చేరుకునే అవకాశం ఉంది. ఆస్పిటల్ ముందు భారీగా పోగవుతున్న వైసీపీ శ్రేణులు. హాస్పిటల్ చేరుకున్న కడప, నంద్యాల వైసీపీ నేతలు, కార్యకర్తలు.

    హాస్పిటల్ కు చేరుకున్న ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవి. విశ్వభారతి హాస్పిటల్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత మీడియా కనిపిస్తే దాడి చేస్తున్న అవినాష్ రెడ్డి వర్గం. విశ్వభారతి ఆస్పిటల్ కు చేరుకున్నారు వైఎస్ విజయలక్ష్మి, అవినాష్ తల్లిని పరామర్శించడానికే హాస్పిటల్ కు వెళ్లినట్లు వైసీపీ నాయకులు తెలిపారు.

  • 22 May 2023 10:57 AM GMT

    కాసేట్లో కర్నూలుకు కేంద్ర బలగాలు

    అవినాష్‌రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. కాసేట్లో కర్నూలుకు కేంద్ర బలగాలు చేరుకోనున్నాయి. శాంతి భద్రతలపై ఎస్పీతో చర్చించారు సీబీఐ అధికారులు. అయితే డీజీపీ సలహా తీసుకుంటామని సీబీఐ అధికారులకు తెలిపారు ఎస్పీ కృష్ణకాంత్‌. అయితే స్ధానిక పోలీసుల నుంచి సీబీఐకి సహకారం లభించక పోవడంతో కేంద్ర బలగాలు వచ్చాకే విశ్వ భారతి ఆస్పత్రికి వెళ్లాలన్న ఆలోచనలో సీబీఐ ఉన్నట్లు సమాచారం. మరోవైపు అవినాష్‌ను లొంగిపొమ్మని కోరగా ఈ నెల 27 తరువాత అందుబాటులో ఉంటానని సమాధానం ఇచ్చినట్లు సమాచారం.

    మరోవైపు బెయిల్‌ కోసం సుప్రీంకోర్టు తలుపు తట్టారు అవినాష్‌ తరపు లాయర్లు. అయితే సుప్రీంకోర్టులో అవినాష్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్‌ పిటిషన్‌ విచారణకు నిరాకరించింది సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్.

    అటు కర్నూలులో తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు ఢిల్లీ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తున్నారు సీబీఐ అధికారులు. ఇక విశ్వభారతి ఆస్పత్రి దగ్గర వైసీపీ శ్రేణులు హైడ్రామా క్రియేట్‌ చేశాయి. ఆస్పత్రి గేటు ముందు ధర్నా చేస్తూ.. ఎవరూ లోపలికి వెళ్లకుండా ఆస్పత్రి ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. అటు మీడియాపై అవినాష్‌ అనుచరుల దాడికి నిరసనగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఆందోళన చేపట్టాయి జర్నలిస్ట్ సంఘాలు.

  • 22 May 2023 10:55 AM GMT

    కర్నూలులో హై టెన్షన్‌.. అవినాష్‌ అరెస్ట్ కు రంగం సిద్ధం

    కర్నూలులో హై టెన్షన్‌ నెలకొంది.ఎంపీ అవినాష్‌ అరెస్ట్ కు రంగం సిద్ధం చేసింది సీబీఐ. తెల్లవారు జామునే కర్నూలుకు చేరుఉన్న సీబీఐ అధికారులు జిల్లా ఎస్పీకి సమాచారం అందిచారు. విశ్వభారతి ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.అవినాష్‌ రెడ్డి అరెస్ట్ అన్న వార్తల నేపధ్యంలో విశ్వభారతి ఆసుపత్రికి అవినాష్‌ అనుచరులు భారీగా చేరుకుంటున్నారు.మరోవైపు మీడియా ప్రతినిధులపై దాడి చేసిన అవినాష్ అనుచరులు కెమెరాలు,సెల్ ఫోన్లు లాక్కుని దౌర్జన్యం చేయడంతో ప్రాణభయంతో పరుగులు తీశారు మీడియా ప్రతినిధులు. అయితే అక్కడే ఉన్న పోలీసులు మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోయారు.  

  • 22 May 2023 6:25 AM GMT

    ఎంపీ అవినాశ్ అరెస్ట్ కు రంగంలోకి దిగిన సీబీఐ

    ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ కు సీబీఐ సమాయత్తం అయింది. ఈ మేరకు హైదరాబాద్ నుంచి కర్నూలుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగుతున్నాయని సమాచారం. కేంద్ర బలగాలు వచ్చాక సీబీఐ కర్నూలు ఆసుపత్రికి వెళ్లనుంది. ఈ మధ్యాహ్నానికి కేంద్రబలగాలు కర్నాలు చేరుకోనున్నాయి. ఈ క్రమంలో స్థానిక పోలీసుల నుంచి సీబీఐకు ఎలాంటి సహకారం లభించడంలేదని తెలుస్తోంది. 



  • 22 May 2023 6:15 AM GMT

    సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డికి ఎదురు దెబ్బ

    సుప్రీం కోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డికి చుక్కెదురైంది. అతడి బెయిల్ పిటిషన్ ను విచారించేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. మెన్షననింగ్ లిస్ట్ లో ఉంటేనే విచారిస్తామని స్పష్టం చేసింది. రేపు మెన్షనింగ్ ఆఫీసర్ ఎదుట హాజరవ్వాల్సిందిగా సూచించింది. 

  • 22 May 2023 5:30 AM GMT

    ఆందోళనకరంగా ఎంపీ అవినాష్ తల్లి ఆరోగ్యం

    ఇక అవినాష్ తల్లి లక్ష్మి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు డాక్టర్లు.ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న డాక్టర్లుCCUలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచామన్నారు. అటు ఆసుపత్రి దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు వైసీపీ కార్యకర్తలు.

Tags

Read MoreRead Less
Next Story