కర్నూలు వైసీపీలో సీతయ్య..?

కర్నూలు వైసీపీలో సీతయ్య..?
కర్నూలు వైసీపీలో ఆ లీడర్ నా మాటే శాసనం అంటున్నారా? హైకమాండ్ దగ్గర మెప్పుకోసం నోరు పారేసుకుంటున్నారా? నోటి దురుసు నేతలపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? కమీషన్లకు కక్కుర్తి పడి కార్పోరేషన్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారా?

కర్నూలు వైసీపీలో ఆ లీడర్ నా మాటే శాసనం అంటున్నారా? హైకమాండ్ దగ్గర మెప్పుకోసం నోరు పారేసుకుంటున్నారా? నోటి దురుసు నేతలపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? కమీషన్లకు కక్కుర్తి పడి కార్పోరేషన్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారా?

కర్నూలు జిల్లా అధికార వైసీపీలో రాజకీయాలు దుమారం రేపుతున్నాయి. కర్నూలు మేయర్‌పై సొంత పార్టీ నేతలే ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కార్పొరేటర్లను లెక్కచేయకుండా ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటూ సొంత పార్టీ నేతలకే కంటిలో నలుసుగా మారినట్లు సమాచారం. జిల్లాలో తనకు ఎదురేలేదన్నట్లు వ్యవహరించడంతో ఆయన తీరుపై క్యాడర్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. తాజాగా మున్సిపల్ కార్పోరేషన్ సర్వసభ్య సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించాయన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీ కార్యాలయం కోసం 80 కోట్ల విలువ చేసే ఏపి ఆగ్రోకి చెందిన ఎకరం 60 సెంట్ల స్థలం కేవలం ఏడాదికి 1600 రూపాయల లీజుకు కేటాయించడం దుమారం రేపింది. మున్సిపల్ కార్పోరేషన్ సర్వసభ్య సమావేశ తీర్మాన కాపీలో ఈ అంశం పొందుపరచడంపై టీడీపీ కార్పోరేటర్లు మేయర్ తీరుపై మండి పడ్డారు. అంతేకాకుండా మేయర్ తన వార్డుపై చూపిస్తున్న శ్రద్ధ మిగతా వార్డుల అభివృద్ధిపై శ్రద్ధ చూపించడం లేదని సొంత కార్పోరేటర్లే ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది.

బీసీ బోయ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బీవీ రామయ్యకు వైసీపి అధిష్టానం రెండు పదవులని కేటాయించింది. వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పదవినీ బీవై రామయ్యకు కేటాయించింది..అయితే పార్టీ అధ్యక్ష పదవి వరకూ భాగానే ఉన్నా మున్సిపల్ మేయర్‌గా రామయ్య ప్రవర్తిస్తున్న తీరుపై సొంత పార్టీ నేతలే ఏకి పారేస్తున్నారు. వైసీపీ హై కమాండ్ మెప్పు కోసం ప్రతిపక్ష నేతలతో పాటు సొంత పార్టీ నేతలపైనా నోరేసుకు పడిపోతున్నారని టాక్ వినిపిస్తోంది. టీడిపి అధినేత చంద్రబాబు, లోకేష్‌లపై పలు మార్లు నోటికొచ్చినట్లు విమర్శలు చేశారు. తన వార్డు అభివృద్ధికి మాత్రమే నిధులు కేటాయించుకుంటూ మిగతా వార్డులపట్ల వివక్ష చూపుతున్నారని వైసీపి కార్పోరేటర్ కాంతి నిలదీయగా పోలీసులని పిలిపించి బయటకు గెంటేయండని మేయర్ ఆదేశించడం వైసీపీలో కలకలం రేపుతోంది.

నిధుల కేటాయింపు అభివృద్ధి పనుల విషయంలో మేయర్ ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని గతంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వర్గం తిరుగుబాటు చేసింది. కార్పోరేషన్‌లో 33 వార్డులున్న తమను మేయర్ పట్టించుకోవడం లేదని..కేవలం పాణ్యం సెగ్మెంట్‌లోని వార్డులకే నిధులు కేటాయిస్తున్నారని కర్నూలుకి చెందిన కార్పోరేటర్లు ఆందోళన చేపట్టారు. మేయర్ తన వార్డులో 8 కోట్ల విలువ చేసే పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి మిగతా వార్డులని పట్టించుకోవడం లేదట. దీంతో వైసీపీ కార్పోరేటర్లే మేయర్ తీరుపై ఆగ్రహంతో ఉన్నట్లు క్యాడర్‌లో చర్చ సాగుతోంది. కార్పోరేషన్ లో జరుగుతున్న తీరు..మేయర్ ఏకపక్ష నిర్ణయాలపై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పార్టీ హైకమాండ్ దగ్గరకి తీసుకెళ్లడంతో సమస్య తొలగిపోయినట్లు టాక్ నడుస్తోంది. దీంతో మేయర్ తీరుపై గుర్రుగా ఉన్న పాణ్యం పరిధిలోని కార్పోరేటర్లు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వద్ద మొర పెట్టుకున్నట్లు చర్చ సాగుతోంది. అయితే మేయర్‌ ను పిలిపించి మాట్లాడేందుకు ప్రయత్నించగా కాటసాని ఎదుటే మేయర్‌కు కార్పొరేటర్లకు తీవ్ర వాగ్వాదం జరిగినట్లు జోరుగా ప్రచారం సాగింది.

గడప గడపకు వెళ్తున్న ఎమ్మెల్యేలను సమస్యలపై ప్రజలు నిలదీస్తుంటే ....సమస్యలు పరిష్కరించాల్సిన మేయర్ బీవై రామయ్య కమీషన్ల కోసం కక్కుర్తి పడి కార్పోరేషన్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని సొంత పార్టీ నేతలు విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వివాదంపై అధినేత దృష్టికి చేరడంతో మేయర్‌ని పద్దతి మార్చుకోవాలని హెచ్చరించినట్లు చర్చ సాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story