భారీ వర్షంలోనూ జనసంద్రంగా యువగళం పాదయాత్ర

భారీ వర్షంలోనూ జనసంద్రంగా యువగళం పాదయాత్ర

భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా నారా లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. లోకేష్‌తో పాటు వేలాది మంది ప్రజలు కూడా అదే వర్షంలో కలిసి నడుస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలో ఉత్సాహంగా సాగుతుంది. భారీ వర్షం కురుస్తున్నా లోకేష్‌ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఆయన వెంట వేలాది మంది ప్రజలు కలిసి నడుస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం వచ్చింది. భారీ వర్షం కురుస్తున్నా గొడుగు నిరాకరించి ముందుకు సాగుతున్నారు. వర్షంలో ఇంత మంది జనం తనవెంట వస్తుంటే తనకెందుకు గొడుగు అని లోకేష్ అన్నారు. వర్షాలు, ఎండలు లెక్క చేయకుండా లోకేష్‌ ముందుకు సాగుతున్నారు. అనూహ్యంగా వచ్చిన భారీ వర్షంతో నిర్వాహకులు ఆందోళన చెందారు. అయినా భారీ వర్షంలో లోకేష్‌ వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారు. ప్రజలు కూడా భారీ సంఖ్యలో పాదయాత్రకు వస్తుండటంతో టీడీపీ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story