United Nations Layoffs : ఐక్యరాజ్య సమితిలోనూ 20శాతం ఉద్యోగాల కోతలు

United Nations Layoffs : ఐక్యరాజ్య సమితిలోనూ 20శాతం ఉద్యోగాల కోతలు
X

ఐక్యరాజ్య సమితి సెక్రటేరియట్ బడ్జెట్ లో 3.7 బిలియన్ డాలర్ల మేర కోత పెట్టాలని నిర్ణయించింది. దీని ఫలితంగా ఉద్యోగుల్లో 20 శాతం మంది లేఆఫ్ చేయాలని భావిస్తోంది. సంస్థ అంతర్గత మెమో ప్రకారం సుమారు 6,900 మంది ఉద్యోగులపై వేటు పడనుంది. జూన్ 13 నాటికి సిబ్బంది తగ్గించేందు అవసరమైన వివరాలు తెలపాలని సెక్ర టేరియట్ సంబంధిత అధికారులను ఆదేశించింది. ఐక్య రాజ్య సమితి బడ్జెట్లో 25 శాతం నిధులు అమెరికా సమ కూర్చుతోంది. ఇటీవల ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరు వాత ఐక్యరాజ్యసమితికి నిధులు ఇవ్వబోమని ప్రకటించారు. దీంతో ఏర్పడిన ఆర్థికసంక్షోభం నుంచి బయట పడేందుకు ఉద్యోగులను తగ్గించుకోవాలని నిర్ణయించింది. దీంతో పాటు విదేశీ సహాయంలోనూ ట్రంప్ కోతలు విధించారు. దీని వల్ల ఐక్యరాజ్య సమితికి చెందిన మానవతా సంస్థలను ఈ చర్య దెబ్బతీసింది.

గతంలో ఇవ్వాల్సిన నిధుల్లో అమెరికా 1.5 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. ఈ మెమో జారీ చేసిన ఐక్యరాజ్యసమితి కంట్రోలర్ చంద్రమౌళి రామనాథన్ మాత్రం అమెరికా చెల్లింపుల గురించి ప్రస్తావించలేదు. మార్చిలో యూఎన్80 సమీక్షలో భాగంగానే ఉద్యోగ కోతలు విధిస్తున్నట్లు చెప్పారు. అమెరికా తాను చెల్లించాల్సిన నిధులను నిలిపివేయ డంతో పాటు, చైనా కూడా చెల్లింపు విషయంలో జాప్యం చేయడంతో ఐక్యరాజ్యసమితి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొం టోంది. ఈ రెండు దేశాలు కలిపి మొత్తం ఐక్య రాజ్యసమితి నిధుల్లో 40 శాతం వాటా కలిగి ఉన్నాయి. రెగ్యులర్ నిధులతో పాటు విచక్షణా నిధులను కూడా ట్రంప్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీని వల్ల అనేక మానవతా సహాయ కార్యక్రమాలను మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది.

Tags

Next Story