Actor Rahul Ravindran : నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం

ప్రముఖ నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని రాహుల్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ‘నాన్న లేని లోటు పూడ్చలేనిది. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూ ఉంటా. థాంక్యూ నాన్నా’ అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. అలాగే తన తండ్రి గురించి చెబుతూ.. తాను దర్శకత్వం వహించిన చి.ల.సౌ సినిమాను గుర్తుచేసుకున్నారు రాహుల్. “చి.ల.సౌ చిత్రానికి నేను ఓ లైన్ రాశాను. అది ఇప్పుడు భిన్నంగా అనిపిస్తుంది. నాన్న ఉన్నారులే.. అన్ని చూసుకుంటారు. అనే మాటకు విలువ నాన్నను కోల్పోయిన వారికి మాత్రమే తెలుస్తోంది.. నాకు ఈరోజు అర్ధమైంది. నాన్న లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. మాటల్లో వివరించలేని భావాలను మనకు అందిస్తుంది. థాంక్యూ నాన్న.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను” అంటూ భావోద్వేగానికి గురయ్యారు రాహుల్. కాగా రాహుల్ పలు తెలుగు సినిమాల్లో నటించడంతో పాటు డైరెక్ట్ చేశారు. సింగర్ చిన్మయి శ్రీపాదను ఆయన పెళ్లాడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com