Ananyapande : అనన్యపాండే గుడ్ న్యూస్!

బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే యువ క్రికెటర్ను పెళ్లి చేసుకోబోతోందనే వార్త చక్కర్లు కొడుతోంది. విజయ్ దేవర కొండ సరసన లైగర్ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బాలీవుడ్కే పరిమితమైంది. లైగర్ డిజాస్టర్ కావడంతో ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. గత కొద్ది కాలంగా ఆదిత్య రాయ్ కపూర్ తో డేటింగ్ చేసిన ఆమె బ్రేకప్ చెప్పేసింది. ఇప్పుడు యువ క్రికెటర్ రియాన్ పరాగ్ ను పెళ్లాడబోతోందనే టాక్ నడుస్తోంది. పరాగ్ ఇటీవలే టీమ్ ఇండియా ఆటగాడిగా ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. భుజం గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో ఆడలేకపోయాడు. మరోవైపు అనన్య పాండేతో అతడి వివాహం జరగబోతోందనే ప్రచారం నెట్టింట దుమారం రేపుతోంది. ఫిబ్రవరి 2025లో పెళ్లి చేసుకోవచ్చని కూడా వార్తలు వైరల్గా మారాయి. దీనిపై అనన్యపాండే గానీ, రియాన్ పరాగ్ గానీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com