AP: స్నేహితుడి పెళ్లికి వచ్చి.. వేదికమీదే కుప్పకూలి

AP: స్నేహితుడి పెళ్లికి వచ్చి.. వేదికమీదే కుప్పకూలి
X
వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటు ప్రాణాలు హరిస్తోంది ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతుంది.

వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటు ప్రాణాలు హరిస్తోంది ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతుంది.

తన స్నేహితుడికి బహుమతి ఇస్తుండగా వేదికపైనే కుప్పకూలిన వ్యక్తి గుండెపోటుతో మృతి చెందడంతో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. వివాహ వేడుక విషాదంగా మారింది.

బెంగుళూరుకు చెందిన అమెజాన్ ఉద్యోగి వంశీ, వేదికపై ఉన్న జంటను పలకరించి, బహుమతి అందజేశాడు. అంతలోనే వంశీ బ్యాలెన్స్ కోల్పోవడం ప్రారంభించాడు. అతడి పక్కనే ఉన్న మిగిలిన స్నేహితులు తూలిపడబోతున్న వంశీని పట్టుకుని పక్కన కూర్చోబెట్టారు. అయినా అతడు స్పృహలోకి రాకపోవడంతో వెంటనే ధోన్‌ సిటీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే వంశీ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. వంశీ తన స్నేహితుడి పెళ్లి కోసం బెంగళూరు నుంచి కర్నూలులోని పెనుముడ గ్రామానికి వెళ్లాడు.

Tags

Next Story