Rajdhani files సినిమా విడుదలకు ఏ.పి. హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

Rajdhani files సినిమా విడుదలకు  ఏ.పి. హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్
రాజదాని ఫైల్స్ సినిమా విడుదలకు తొలగిన అడ్డంకులు సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏ.పి. హైకోర్ట్

‘రాజధాని ఫైల్స్‌’ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

రివైజింగ్‌ కమిటీ అన్ని సర్టిఫికెట్లు పరిశీలించాకే ధ్రువపత్రం జారీ చేసిందని స్పష్టం చేసింది. సీఎం జగన్‌, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఈ సినిమాను తీశారని..గతేడాది డిసెంబర్‌ 18న సీబీఎఫ్‌సీ జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఇటీవల హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ నెల 13న విచారణ జరిపిన కోర్టు.. సెన్సార్‌ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్లు సక్రమేనన్న హై కోర్టు ,సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలువరిస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా శుక్రవారం విచారణ చేపట్టి చిత్రం విడుదలకు అంగీకారం తెలిపింది.

Tags

Next Story