Indian Railway Services: రైళ్లలో ఏటీఎం సేవలు

చేతిలో డబ్బుల్లేవ్.. యూపీఐ పని చేయడం లేదు.. అసలే రైల్లో ఉన్నం.. ఎలా..? అని ఆలోచిస్తున్నారా..? ఆ టెన్షన్ వద్దంటోంది ఇండియన్ రైల్వేస్. రైళ్లలో ఏటీఎం సేవలను అందుబాటులోకి తేనుంది. సెంట్రల్ రైల్వే తొలిసారిగా ముం బయిమన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్ లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు. రోజూ నడిచే ఈ ఎక్స్ప్రెస్లో ఓ ప్రైవేట్ బ్యాంకు చెందిన ఏటీఎంను ఏసీ చైర్కార్ కోచ్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. త్వరలో పూర్తి స్థాయిలో ఈ సదుపాయా న్ని అందుబాటులోకి తెస్తామని వెల్ల డించారు. పంచవటి ఎక్స్ప్రెస్లో ప్రయోగాత్మకంగా దీనిని ఏర్పాటు చేసినట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలే షన్స్ ఆఫీసర్ స్వప్నిల్ నీలా వెల్లడించారు. కోచ్లో గతంలో తా త్కాలిక ప్యాంట్రీగా ఉప యోగించిన స్థలంలో ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు. రైలు కదులుతున్నప్పుడు భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి దీనికి షట్టర్ డోర్ ను కూడా అమర్చారు. ఇందుకు సంబంధించి కోచ్లో అవసరమైన మార్పులను మన్మాడ్ వర్క్షా ప్లో చేపట్టినట్లు అధికారులు వివరించా రు. పంచవటి ఎక్స్ప్రెస్ ముంబైలోని సీఎస్టీ నుంచి మన్మాడ్ జంక్షన్ వరకు వెళ్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com