Bigg Boss Sonia : పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ సోనియా

Bigg Boss Sonia : పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ సోనియా
X

ఇటీవల ముగిసిన బిగ్‌బాస్ సీజన్-8తో పాపులర్ అయిన నటి సోనియా ఆకుల వివాహం చేసుకున్నారు. తన ప్రియుడి యశ్‌తో ఇవాళ తెల్లవారుజామున ఆమె పెళ్లి జరిగింది. ఈ వేడుకకు బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో పాటు ఇతర నటులు హాజరయ్యారు. తెలంగాణలోని మంథనికి చెందిన సోనియా ఆర్జీవీ తెరకెక్కించిన రెండు చిత్రాల్లో నటించారు. దీంతో ఆమెకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది సోనియా ఆకుల. అంతకు ముందు డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన ఒకటి రెండు చిత్రాల్లో నటించింది. దీంతో అదే గుర్తింపుతో బిగ్‌బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టింది. ఈ షోలో మొదటి వారంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నిరూపించింది. తన ఆట తీరు, ప్రతి విషయంలో ప్రశ్నించే తీరుతో ఆమె పేరు నెట్టింట మారుమోగిపోయింది.

దీంతో సోనియా టాప్ 5 కంటెస్టెంట్ అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత నిఖిల్, పృథ్వీలతో స్నేహం చేయడంతో ఆమెపై విపరీతమైన నెగిటివిటీ వచ్చేసింది. దీంతో నాలుగో వారంలోనే బయటకు వచ్చేసింది. హౌస్‏లో ఉన్నప్పుడు తన ప్రియుడు యష్ గురించి బయటపెట్టింది. తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది సోనియా ఆకుల. తన ప్రియుడు యష్ వీరగోనితో కలిసి ఏడుగులు వేసింది.

Tags

Next Story