మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ అభ్యర్థి రాహుల్ నార్వేకర్ ఏకగ్రీవ ఎన్నిక..

మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ అభ్యర్థి రాహుల్ నార్వేకర్ ఏకగ్రీవ ఎన్నిక..
X
అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి భారీ మెజారిటీ వచ్చింది.

ముంబైలోని కొలాబా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ సోమవారం అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతర అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మరోవైపు ఈరోజు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) సభా కార్యక్రమాలను బహిష్కరించింది.

ఆదివారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, ఇతర నేతల సమక్షంలో రాహుల్ నర్వేకర్ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వరుసగా రెండోసారి స్పీకర్‌ అయ్యారు.

భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ మాట్లాడుతూ, “నాకు మళ్లీ అసెంబ్లీ స్పీకర్‌గా అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లకు ధన్యవాదాలు” అని అన్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ మూడు రోజుల ప్రత్యేక సమావేశాలకు నేడు చివరి రోజు. నేడు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకోనుంది. స్పీకర్ ఎన్నిక అనంతరం కొత్త మహాయుతి ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకోనుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి భారీ మెజారిటీ వచ్చింది

అధికార మహాయుతి కూటమిలో బీజేపీ 132 సీట్లు, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి.

Tags

Next Story