BMW Electric Car : దేశమంతా ఒకే ధరకు బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ కారు

BMW Electric Car : దేశమంతా ఒకే ధరకు బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ కారు
X

బీఎండబ్ల్యూ ఇండియా తన ఎలక్ట్రిక్ సెడాన్ ఐ7 కారును భారత్లో అన్ని రాష్ట్రా ల్లోనూ ఒకే ఎక్స్ షో రూమ్ ధర 2.05 కోట్లకు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ధరలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు, జీఎస్టి, పరిహార సెస్లు ఉంటాయి. వినియోగదారలు బీమా, టీసీఎస్, స్థానిక సెస్ లను మాత్రమే చెల్లిస్తారు. కొత్త ధరల ప్రకారం కొను గోలుదారులు బీఎండబ్ల్యూ ఐ 7 కు సంబంధించి రిజిస్ట్రేషన్ ఖర్చులు చెల్లించాల్సిన అసవరంలేదని తెలిపింది. రిజి స్ట్రేషన్ ఛార్జీలు రాష్ట్రాల వారీగా వేరువేరుగా ఉంటాయి. ఇ కనుంచికంపెనీనే వీటిని చెల్లించనుంది. దీంతో దేశమంగా ఈ కారును ఒకే ధరకు అందించనున్నట్లు బీఎండబ్ల్యూ ఇం డియా గ్రూప్ అధ్యక్షుడు, సీఈఓ విక్రమ్ పావా తెలిపారు. ఇక ఉంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలతో సంబంధం లేకుండా ఏ రాష్ట్రం కొనుగోలుదారులకైనా ఒకే ధరలో ఈ కారును అందిస్తామని చెప్పారు.

Tags

Next Story