Charuhasan : అనారోగ్యంతో హాస్పిటల్‌లో చారుహాసన్

Charuhasan : అనారోగ్యంతో హాస్పిటల్‌లో చారుహాసన్
X

ప్రముఖ తమిళ క్యారెక్టర్ యాక్టర్, డైరెక్టర్ చారుహాసన్‌ అనారోగ్యంతో ఆసుపత్రిపాలయ్యారు. గురువారం రాత్రి ఆయన అనారోగ్యానికి గురవడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చారుహాసన్‌ కమల్‌హాసన్‌ సోదరుడు అన్న సంగతి తెలిసిందే. చారుహాసన్ ఆరోగ్యంపై ఆయన కుమార్తె, నటి సుహాసిని మణిరత్నం సోషల్ మీడియాలో స్పందించారు. దీపావళికి ముందు ఆయన అనారోగ్యం బారిన పడినట్టు నటి సుహాసిని తెలిపారు. చారు హాసన్ ను ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సర్జరీకి సిద్ధమవుతున్నారని ఆమె తెలిపారు. ఆయనకు శస్త్రచికిత్స చేయనున్నట్లు తెలుస్తోంది. 93 ఏళ్ల చారు హాసన్‌ ఈ ఏడాది ఆగస్టులోనే వయసురీత్యా ఎదురైన ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అనేక సినిమాలు, సీరియల్స్ లో చారుహాసన్ నటించారు.

Tags

Next Story