CM Revanth Reddy : మొగిలయ్య మృతిపై సీఎం రేవంత్ సంతాపం

తెలంగాణ జానపద కళాకారుడు పస్తం మొగిలయ్య గారి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బేడ బుడగ జంగాల జానపద కళారూపం 'శారద కథల'కు బహుళ ప్రాచుర్యం కల్పించి, ఆ కళకే గొప్ప బలగంగా నిలిచిన మొగిలయ్య గారి మరణం బడుగుల సంగీత సాహిత్య రంగానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన పస్తం మొగిలయ్య గారు శారద తంబుర మీటుతూ, పక్కనే బుర్ర (డక్కీ) వాయిస్తూ వారి సతీమణి కొమురమ్మ గారు పలు చోట్ల ఇచ్చిన అనేక ప్ర దర్శనలు వెలకట్టలేనివని, తెలంగాణ ఆత్మను ఒడిసిపట్టిన "బలగం" సినిమా చివర్లో వచ్చే మొ గిలయ్య గారి పాట ప్రజల హృదయాల్లో చిరస్థా యిగా నిలిచిపోయిందని గుర్తుచేశారు.
బలగం సినిమాలో కన్నీళ్లు పెట్టించిన జానపద గాయకుడు మొగిలయ్య (67) ఇక లేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తెలంగాణ పల్లె నేపథ్యంతో తెరకెక్కిన బలగం సినిమా క్లైమాక్స్ లో కొమురయ్య పాత్రధారి మరణించిన తర్వాత.. మొగిలయ్య తన భావోద్వేగభరితమైన పాట పాడి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ము ద్రవేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆయనకు గుర్తింపు వచ్చింది. కొన్నిరోజులుగా మొగిలయ్య కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స కోసం ప్రముఖ నటుడు చిరంజీవి, బలగం దర్శకుడు వేణు ఆర్థికసాయం చేశారు.
ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వరంగల్లో ని సంరక్ష ఆస్పత్రికి ఆయనను తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు . పొన్నం సత్తయ్య అవార్డు అందుకున్న మొగిలయ్య దంపతు లకు ఇల్లు నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. మొగిలయ్య మరణంతో ఆయన స్వగ్రామం దుగ్గొండిలో విషాదఛాయలు అలుముకున్నాయి. 'బలగం' దర్శక నిర్మాతలు వేణు, దిల్ రాజు సంతాపం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com