UPI Services : ఫోన్ పే, గూగుల్ పే ఉపయోగిస్తున్నారా?

ఏప్రిల్ 1 నుంచి NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొత్త మార్గదర్శకాలు అమలు చేయనుంది. ఈ రూల్స్ ప్రకారం డియాక్టివేట్, సరెండర్ చేసిన మొబైల్ నంబర్లను ఈ నెల 31లోగా తొలగించాలని బ్యాంకులను ఆదేశించింది. ఆ తర్వాత ఈ నంబర్లను ఉపయోగించి ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలు పొందలేరని తెలిపింది. అప్డేట్ చేసిన మొబైల్ నంబర్ సిస్టమ్‌ను ఉపయోగించి ట్రాన్సాక్షన్ల సంఖ్యను పేర్కొనాలని సూచించింది. రోజురోజుకూ సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతుండటంతో ఎన్ పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్ యాక్టివ్ మొబైల్ నంబర్లు బ్యాంకింగ్, యూపీఐ వ్యవస్థల్లో సాంకేతిక లోపాలను సృష్టిస్తున్నాయని పేర్కొంది. టెలికాం ప్రొవైడర్లు ఈ నంబర్లను వేరొకరికి తిరిగి కేటాయిస్తే, ఇది మోసానికి వీలు కల్పిస్తుంది. అందువల్ల, యుపిఐ లావాదేవీలను సులభంగా నిర్వహించడానికి యాక్టివ్ గా ఉన్న మొబైల్ నంబర్ అవసరం. అలాగే, ఆ నంబర్ ను మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి ఉండాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com