Elon Musk : బిలియనీర్ల జాబితాలో మస్క్ ఫస్ట్

ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన సం పన్నుల జాబితా - 2025లో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ముందున్నారు. 342 బిలియన్ డాలర్ల నికర విలువతో ఆయన అగ్రస్థానం దక్కించుకు న్నారు. గతేడాదితో పోలిస్తే మస్క్ సంపద 147 బిలియన్ డాలర్లు పెరిగింది. ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ రెండో స్థానంలో నిలిచారు. ఆయన సంపాదన 216 బిలియన్ డాలర్లు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 215 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు. టాప్ టెన్ జాబితాలో ఉన్న వారిలో టెక్నాలజీ రంగానికి చెందిన వారే ఆరుగురు ఉండటం విశేషం. అంబానీకి 18వ స్థానం, అదానీకి 25వ ప్లేస్ ఇండియాలోనే సంపన్నుడిగా పేరున్న రిలయెన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి 18వ స్థానం దక్కింది. ఆయన ఆస్తి 92.5 బిలియన్ డాలర్లు ఉండటం గమనార్హం. గతేడాది ముఖేశ్ అంబానీ ఆస్తి విలువ 119.5 బిలియన్ డాలర్లు ఉండగా ఈ సారి డౌన్ అయ్యింది. భారత్ కు చెందిన మరో సంపన్నుడు అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీకి 28వ స్థానం లభించింది. ఆయన నికర ఆస్తుల విలువ 56.3 బిలియన్ డాలర్లు. గతేడాది అదానీ సంపాదన 116.5 బిలియన్ డాలర్లు ఉంది.
ఇండియాస్ రిచెస్ట్ ఉమన్ సావిత్రి జిందాల్
భారత్ లోని సంపన్నురాలైన మహిళగా జిందాల్ సంస్థల అధినేత్రి సావిత్రి జిందాల్ ఫ్యామిలీ నిలిచింది. ఆమె ఆస్తుల విలువ 35.5 బిలియన్ డాలర్లని ఫోర్బ్స్ పేర్కొంది. అదే విధంగా సావిత్రి జిందాల్ ప్రపంచంలో 56వ సంపన్నురాలిగా పేర్కొంది. అత్యధిక మంది బిలియనీర్లు ఉన్న దేశంలో అమెరికా రికార్డు కంటిన్యూ చేస్తోంది. ఇక్కడ 902 మంది బిలియనీర్లు ఉన్నట్టు ఫోర్బ్స్ పేర్కొంది. అదే విధంగా రెండో స్థానంలో చైనా నిలిచింది. ఈ దేశంలో 516 మంది బిలియనీర్లు ఉన్నారు. మూడో ప్లేస్ లో భారత్ కొనసాగుతోంది. గత ఏడాది మన దేశంలో 200 మంది బిలియనీర్లు ఉండగా ఈ సారి 205కు చేరి మూడో స్థానంలో నిలిచింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com