మహా కుంభ్‌లో అగ్నిప్రమాదం.. 40 గుడిసెలు, 6 గుడారాలు దగ్ధం

మహా కుంభ్‌లో అగ్నిప్రమాదం.. 40 గుడిసెలు, 6 గుడారాలు దగ్ధం
X
లక్షలాది మంది భక్తులతో మహా కుంభ్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుని 40 గుడిసెలు, 6 గుడారాలు దగ్ధమయ్యాయి. ప్రాణనష్టం గురించి సమాచారం లేదు.

ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాధిత ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వివరించినట్లు అధికారులు తెలిపారు.

మహా కుంభమేళాలో ఆదివారం సాయంత్రం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం 40 గుడిసెలు, ఆరు గుడారాలు దగ్ధమయ్యాయి. ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.

“మంటలు చల్లారాయని, పరిస్థితి అదుపులో ఉంది” అని ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ మందార్ తెలిపారు.


Tags

Next Story