Vietnam Flight Service : హైదరాబాద్ నుంచి వియత్నాంకు విమాన సర్వీస్

Vietnam Flight Service : హైదరాబాద్ నుంచి వియత్నాంకు విమాన సర్వీస్
X

మార్చి 18 నుంచి హైదరాబాద్, వియత్నాం మధ్య విమాన సర్వీస్ అందుబాటులోకి రానుంది. వియట్‌జెట్ సంస్థ నడిపే ఈ విమాన సర్వీసులు వారంలో రెండు రోజులు(మంగళ, శనివారం) మాత్రమే అందుబాటులో ఉంటాయి. హోచిమన్ సిటీ(వియత్నాం) నుంచి రాత్రి 7.40కు బయల్దేరే ఫ్లైట్ రాత్రి 10.35కు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుతుంది. రాత్రి 11.35కు శంషాబాద్‌లో బయల్దేరి, తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు వియత్నాం చేరుతుంది.

హైదరాబాద్‌తోపాటు బెంగళూరు మధ్య ప్రారంభంకానున్న ఈ నూతన సర్వీసు సందర్భంగా ప్రారంభ విమాన టికెట్‌ ధర పన్నులు కలుపుకొని రూ.11గా నిర్ణయించింది. ఈ నెల 30 వరకు బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికులు ఫిబ్రవరి 10 నుంచి సెప్టెంబర్‌ 30 లోగా ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపింది. దీంతోపాటు బిజినెస్‌, స్కైబాస్‌ టికెట్‌పై 20 శాతం తగ్గింపు ధరకు విక్రయిస్తున్నది. ఈ సర్వీసు కేవలం మంగళ, శనివారాలు మాత్రమే.

Tags

Next Story