Flipkart Diwali Sale : అక్టోబర్ 21 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్

ప్రముఖ ఇ- కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌కు సిద్ధమైంది. ఇటీవల దసరా సందర్భంగా ‘బిగ్ బిలియన్ డేస్’ పేరిట ఆఫర్లు తీసుకొచ్చిన సంస్థ.. తాజాగా ‘బిగ్ దీపావళి సేల్’ తేదీలను ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి ఈ సేల్ మొదలవుతుందని కంపెనీ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ లేదా వీఐపీ కస్టమర్లకు ఒక రోజు ముందుగానే ఈ విండో తెరుచుకోనుంది. దీపావళి సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై పెద్ద ఎత్తున ఆఫర్లు ఉండనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఎంపిక చేసిన కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి 10శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. దీపావళి సేల్‌లో అందిస్తున్న ఆఫర్లను తాజాగా తన వెబ్‌సైట్‌లో రివీల్ చేసింది. ఐఫోన్ 15 రూ.49,999కే లభించనుంది. పాత తరం యాపిల్ ఎయిర్‌పాడ్స్‌ను ఈ సేల్‌లో రూ.9,999 కంటే తక్కువకే కొనుగోలు చేయొచ్చని తాజా డీల్స్‌ను చూస్తే తెలుస్తోంది. ఇక యాపిల్ మ్యాక్స్ బుక్ ఎయిర్ ఎం2పై రాయితీ అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఎంత వరకు డిస్కౌంట్ ఉంటుందనే విషయాన్ని వెల్లడించలేదు. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 రూ.37,999, గెలాక్సీ ఎస్23 ఎఫ్‌ఈ రూ.29,249, ఐప్యాడ్ (2021) ధర రూ.20వేల కన్నా తక్కువకే కొనుగోలు చేయొచ్చని ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. త్వరలోనే మరిన్ని డీల్స్ రివీల్ చేయనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com