Gmail : జీమెయిల్​ కొత్త ఫీచర్​

Gmail : జీమెయిల్​ కొత్త ఫీచర్​
X

జీమెయిల్‌ సేవల్లో గూగుల్‌ సరికొత్త ఫీచర్‌ తీసుకొచ్చింది. సందర్భోచితంగా సమాధానం పంపేందుకు స్మార్ట్‌ రిప్లై సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని సాయంతో ఇకపై ప్రత్యుత్తరం పంపడం సులభం కానుంది. మెయిల్స్‌కు రిప్లై ఇవ్వాలంటే జీమెయిల్‌ సాధారణంగానే కొన్ని సూచనలను డిస్‌ప్లే చేస్తుంది. 2017లోనే ఈ ఫీచర్‌ని తీసుకొచ్చింది. అయితే.. దానికి ఇప్పుడు ఏఐ సదుపాయాన్ని జోడించింది. దీంతో ఇక మీ ప్రత్యుత్తరం మరింత స్మార్ట్‌గా మారనుంది. మీరు సమాధానం పంపాలనుకుంటున్న మెయిల్స్‌ను ఓపెన్‌ చేసి రిఫ్లై పై క్లిక్‌ చేయగానే కింద ఇందులోని ఏఐ సాంకేతికత మీకు అనేక సజెషన్లు డిస్‌ప్లే చేస్తుంది. మెయిల్‌లో ఉండే సమాచారాన్ని మొత్తం అర్థం చేసుకొని సందర్భోచితంగా ఈ ప్రత్యుత్తరాలు తయారుచేస్తుంది. నచ్చిన వాటిని ఎంచుకొని ప్రివ్యూ చేయొచ్చు. ఒకవేళ ఏవైనా మార్పులు చేయాలనిపిస్తే ఎడిట్‌ చేసి సెండ్‌ చేసేయొచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌లకు ఈ ఫీచర్‌ సపోర్ట్‌ చేస్తుంది. ప్రస్తుతం గూగుల్ వన్‌ ఏఐ ప్రీమియంతో పాటు కొందరు యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే జీమెయిల్‌ యూజర్లందరికీ రోలవుట్‌ అవుతుంది.

Tags

Next Story