Special Train : తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు

Special Train : తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు
X

తిరుపతి వెళ్లే భక్తులకు శుభవార్త. చర్లపల్లి టెర్మినల్ నుండి తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి, ముఖ్యంగా పండుగలు, సెలవు దినాల్లో తిరుపతికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 3 నుంచి 24వరకు ప్రతి ఆదివారం తిరుపతి - చర్లపల్లిమార్గంలో 4 రైళ్లు, ఆగస్టు 4నుంచి 25వరకు ప్రతి సోమవారం చర్లపల్లి - తిరుపతి రూట్లలో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లుగా సౌత్ సెంట్రల్ రైల్వేస్ అధికారులు తెలిపారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక వీక్లీ సర్వీసులను నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నెల 25 నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి శుక్రవారం ఎర్నాకుళం- పాట్నా మార్గంలో నాలుగు రైళ్లు, ఈనెల 28నుంచి ఆగస్టు 18 వరకు ప్రతి సోమవారం పాట్నా-ఎర్నాకుళం మధ్యలో నాలుగు రైళ్లు నడుపనున్నట్లు అధికారులు తెలిపారు.

Tags

Next Story