66 Dishes : కొత్త జంటకు 66 రకాల వంటలతో విందు.. ఆంధ్రలో కాదు

66 Dishes : కొత్త జంటకు 66 రకాల వంటలతో విందు.. ఆంధ్రలో కాదు
X

మహబూబాబాద్ జిల్లా బయ్యారం గ్రామంలో ఓ కుటుంబం దసరా పండుగను వినూత్నంగా జరుపుకుంది. కొత్తగా వివాహమైన జంటను, వారి బంధువులను ఇంటికి ఆహ్వానించి 66 రకాల వంటలను తయారు చేసి విందు భోజనం ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచింది. బయ్యారానికి చెందిన గరిపెల్లి లావణ్య, వేణు కుటుంబం కొత్తగా వివాహమైన దంపతులను దసరాకు ఆహ్వానించారు. ఏకంగా 66 రకాల వంటకాలతో వేణు కుటుంబం నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టి కొత్త అల్లుడికి విందు భోజనం ఏర్పాటు చేసింది. కొత్త అల్లుడికి 66 వంటకాలతో భోజనం ఏర్పాటు చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.

తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామానికి చెందిన వంశీకి వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం ధర్మారావుపేటకు చెందిన శ్వేతతో ఆగస్టు 28న పెళ్లి జరిగింది. ఆచార సంప్రదాయాల ప్రకారం వివాహమయ్యాక వచ్చే తొలి దసరా, ఉగాది పండుగలను చేదు పండుగలుగా భావించి, అత్తింటి వారు కొత్త అల్లుడిని ఇంటికి తీసుకురారు, అందుకు అనుగుణంగా వారి బంధువు బయ్యారం గ్రామానికి ఆహ్వానించి 66 వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేసి సంతృప్తి పరిచారు.

Tags

Next Story