Aghori Sadhus : వర్షిణి జీవితాన్ని నాశనం చేశాడు.. అఘోరీని అరెస్ట్ చేయండి: సాధువులు

వివాదాస్పద అఘోరీ శ్రీనివాస్ పై సాధువులు ఫైర్ అయ్యారు. వర్షిణి జీవితాన్ని నాశనం చేసిన అఘోరీ శ్రీనివాస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సాధువులు. వర్షిణిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని కోరారు. నాగసాధు అఘోరీ అని చెప్పుకుంటూ ఘోరాలు చేస్తున్న శ్రీనివాస్ ను శిక్షించాలని డిమాండ్ చేశారు సాధువులు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల బాధ్యత అన్నారు సాధువులు. రెండు తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా హల్చల్ చేస్తున్న లేడీ అఘోరీ బండారం బయటపడింది. ఏపీకి చెందిన శ్రీ వర్షిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంది లేడీ అఘోరి. హిందూ సాంప్రదాయం ప్రకారం... శ్రీ వర్షిని మెడలో తాళి కూడా కట్టింది. గుజరాత్ లోని ఓ ప్రముఖ గుడి ప్రాంగణంలో వీరిద్దరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com