Srisailam Reservoir : శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. గేట్లు ఎత్తిన అధికారులు

Srisailam Reservoir : శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. గేట్లు ఎత్తిన అధికారులు
X

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. ఎగువ రాష్ట్రాల నుండి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్ నీటి నిల్వ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,61,382 క్యూసెక్కులు ఉండగా...ఔట్ ఫ్లో 1,46,474 క్యూసెక్కులు గా ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.10 అడుగుల వద్ద నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో పర్యాటకులు శ్రీశైలానికి బారులు కడుతున్నారు. కాగా వర్షాల ప్రభావంతో శ్రీశైలం కు పర్యాటకులు రావొద్దని... ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags

Next Story