Nagarjuna Sagar Reservoir : నాగార్జునసాగర్‌ జలాశయానికి భారీగా వదర ప్రవాహం

Nagarjuna Sagar Reservoir : నాగార్జునసాగర్‌ జలాశయానికి భారీగా వదర ప్రవాహం
X

నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద ప్రవాహం వస్తోంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం దాదాపు 586 అడుగులకు చేరుకుంది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తుండటంతో, నాగార్జునసాగర్‌కు ఇన్-ఫ్లో దాదాపు 4 లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువగా నమోదవుతోంది. జలాశయం నిండుకుండలా మారడంతో, అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 26 గేట్లు ఎత్తి దాదాపు 3 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టు నిండిపోయింది. దీంతో శ్రీశైలం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో ఆ వరద ప్రవాహం నాగార్జునసాగర్‌కు చేరుకుంటోంది. ఈ సీజన్‌లో ఇంత భారీగా వరద రావడం ఇదే మొదటిసారి.

Tags

Next Story