Holi : హోలి: కృత్రిమ రంగులు వాడుతున్నారా?

Holi : హోలి: కృత్రిమ రంగులు వాడుతున్నారా?
X

హోలి వేడుకల్లో కృత్రిమ రంగులను వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ రంగులు కళ్లలో పడితే కంటి వాపు, మసకబారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఇక చర్మంపై పడితే పొడిబారడం, దురదలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి వెళ్తే శ్వాస, జీర్ణ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. సహజ రంగులనే వాడాలని సూచిస్తున్నారు. హోలీ సందర్భంగా వాడే కృత్రిమ

రంగులతో చర్మ సమస్యలతో పాటు కంటికి ప్రమాదం. కనుక ఇంటి వద్ద లభించే వస్తువులతోనే రంగులు తయారు చేయవచ్చు. పసుపులో కొంత శనగపిండి కలిపితే రంగుగా మారుతోంది. ఎర్ర మందారం బియ్యంపిండి, కుంకుమపువ్వు కలపాలి. ఆకులను ఎండబెట్టి గ్రైండర్ పడితే గ్రీన్ కలర్ రెడీ. గులాబీ రేకులను పొడిగా చేసుకొని రుబ్బితే సరిపోతుంది. వీటితో పాటు కంటికి అద్దాలను ధరిస్తే ఎటువంటి ప్రమాదం ఉండదు.

హోలీ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీవీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. రోడ్డుపై వెళ్తోన్న తెలియని వ్యక్తులపై రంగులు చల్లితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్లిక్ రోడ్స్, ప్లేసెస్‌లో రంగులు చల్లుతూ ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దన్నారు. బైక్స్, ఇతర వాహనాలతో గుంపులుగా తిరగడం నిషేధమని తెలిపారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉండనుంది.

Tags

Next Story