Honda Activa Electric : హోండా యాక్టివా ఈ ఆగయా

Honda Activa Electric : హోండా యాక్టివా ఈ ఆగయా
X

అందరూ ఆసక్తిగా ఎదురు చూ స్తున్న హోండా యాక్టివ్ ఈ బైక్ కొద్ది సేపటి క్రితం లాంచ్ అయ్యింది. దీనిని రెండు వేరియంట్లలో విడుదల చేసింది హోండా సంస్థ. స్టాండర్డ్, సింక్ డ్యూయో వెర్షన్లలో అందు బాటులోకి తెచ్చింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ల విక్రయాల బుకింగ్ జనవరి 1 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. ప్రారంభ దశలో ఢిల్లీ, ముంబై, బెంగళూరులో అందుబా టులో ఉంటాయి. తర్వాత ఇతర నగరాల్లోకి విస్తరిస్తారు. ఒక జత 1.5 కిలోవాట్స్ స్వాప్ బ్యాటరీ దీనికి అమర్చు తారు. దీనిని పూర్తిగా చార్జింగ్ చేస్తే 102 కిలో మీటర్ల మేర ప్రయాణించ వచ్చునని తెలిపింది. ఈ బ్యాటరీలను హోండా మొబైల్ పవర్ ప్యాక్ అంటారు. మూడు రైడింగ్ మోడ్ లు అందుబాటులో ఉన్నాయి. ఎకాన్, స్టాండర్డ్, స్పోర్ట్స్ గరిష్ట వేగం 80 కిలోమీటర్ల వరకు ఉంటుందని సంస్థ తెలిపింది. హోండా రోడ్ సింక్ డ్యూయో స్మార్ట్ అప్లికేషన్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి. ఫీచర్ల హోస్ట్ తో ఏడు అంగుళాల టీఎఫ్ఎ స్క్రీన్ ఉంటుంది. పెరల్ షాలో బ్లూ, పెరల్ మిస్ట్రీ వైట్, పెరల్ సెరినిటీ బ్లూ, మ్యాట్ ఫాగీ సిల్వర్ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్ వంటి ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది. సస్పెన్షన్ కోసం స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో మోనోషాక్ యూనిట్ ఉంటుంది. బ్రేకింగ్ కోసం ముందు భాగంలో డిస్క్ బ్రేకులు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేకులు ఉంటాయి. వీటి ధర రూ. 1 లక్ష నుంచి 1.30 లక్షల వరకు ఉంటుంది

Tags

Next Story