Bhogi : భోగి’ అనే పేరు ఎలా వచ్చిందంటే..

భుగ్ అనే సంస్కృత పదం నుంచి ‘భోగి’ అనే పదం వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. భోగం అంటే పవిత్రమైనది. పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదా దేవి లీనమై భోగాన్ని పొందింది. ఇదే రోజున విష్ణువు వామనావతరంలో బలిని పాతాళానికి అణచివేశాడు. గోకులంలో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను, గోపాలకులను రక్షించారని చెబుతారు. వీటన్నింటికి ప్రతీకగా భోగి పండుగ జరుపుకోవడం సంప్రదాయంగా మారిందని పురాణ గాథ.
భోగీ నాడు ఊరువాడ భోగి మంటలు వేయడం అనవాయితీగా ఉన్నా దీనికి శాస్త్రీయ కోణం ఉంది. ఈ మంటలు వేయడం వల్ల పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా సామాజిక బంధాలు బలపడతాయి. అందరూ ఒక చోట చేరడంతో ఐక్యత పెరుగుతుంది. చలి కాలంలో ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఇంట్లోని చెత్తను నిర్మూలించడమే కాకుండా ఈ బూడిద నుంచి పోటాషియం వంటి ఖనిజాలు మట్టికి అందుతాయి. ఈ మంటల్లో పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ది అవుతుంది.
సంక్రాంతి అంటేనే గాలిపటాలు ఎగురవేయడం తప్పనిసరి. ముఖ్యంగా పిల్లలు గాలిపటాలు ఎగురవేయాలని ఉత్సాహపడుతుంటారు. వీటిని ఎగురవేసే సమయంలో మాంజాను కాకుండా సాధారణ దారాలను ఉపయోగించాలి. రోడ్ల పక్కన, రైల్వే ట్రాకులు, విద్యుత్ పోల్స్ సమీపంలో ఎగరవేయడం ప్రమాదకరం. భవనాలపై ఎగురవేసినప్పుడు, చిన్నపిల్లలు పక్కన ఉంటే జాగ్రత్తగా ఉండాలి. కాళ్లకు గాయాలు కాకుండా షూలు, చెప్పులు ధరించడం తప్పనిసరి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com