Hyderabad: వేగంగా వస్తున్న కారు ఢీకొని పాదచారి మృతి.. పరారీలో డ్రైవర్

మద్యం తాగి మితిమీరిన వేగంతో వాహనాలు డ్రైవ్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. పాదచారులను, ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వారి ప్రాణాలను తీస్తున్నారు మరి కొందరు వాహనదారులు. తీవ్ర గాయాలపాలైన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
మూడు రోజుల క్రితం మీర్‌పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పాదచారి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. బుధవారం సాయంత్రం మీర్‌పేటకు చెందిన అనిల్ అనే వ్యక్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ప్రమాదం జరిగిన తర్వాత కారు డ్రైవర్ సంఘటనా స్ధలం నుంచి పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారును గుర్తించి ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com