Hyderabad: బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం.. అతి వేగంతో విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టిన కారు..

Hyderabad: బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం.. అతి వేగంతో విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టిన కారు..
X
బంజారాహిల్స్ వద్ద అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ అందులో ప్రయాణిస్తున్న వారికి ఏం కాలేదు.. కారు మాత్రం నుజ్జునుజ్జయింది.

బంజారాహిల్స్ వద్ద అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ అందులో ప్రయాణిస్తున్న వారికి ఏం కాలేదు.. కారు మాత్రం నుజ్జునుజ్జయింది. మంగళవారం తెల్లవారుజామున కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉద్యోగులను తమ కార్యాలయానికి దింపేందుకు కారు పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్‌కు వెళ్తోంది.

మంజుల జ్యువెల్స్ వద్దకు రాగానే అతివేగంతో వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ కారును విద్యుత్ స్తంభానికి ఢీకొట్టాడు. కాగా డ్రైవర్‌, ప్రయాణికుడు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది.

Tags

Next Story