Mahira Sharma : సిరాజ్‌తో డేటింగ్ చేయట్లేదు: మహీరా శర్మ

క్రికెటర్ సిరాజ్‌తో డేటింగ్ వార్తలను బాలీవుడ్ నటి మహీరా శర్మ ఖండించారు. తాను ఎవరితోనూ రిలేషన్‌లో లేనని స్పష్టం చేశారు. ఫ్యాన్స్ ఎవరితోనైనా సంబంధం కలిపేస్తారని, వాటిని ఆపలేమని పేర్కొన్నారు. ‘కో స్టార్లతో రిలేషన్ ఉందంటారు. ఎడిటెడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తారు. వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. ఇటీవల ఆమె తల్లి సానియా శర్మ కూడా డేటింగ్ వార్తలను కొట్టిపారేశారు. బిగ్ బాస్ 13 ఫేమ్ నటి మహిరా శర్మ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. దీనికి ముఖ్య కారణం సిరాజ్, మహిరాలు ఇన్‌స్టాగ్రామ్ ఒకరినొకరు ఫాలో అవ్వడమే. అయితే ఈ ఫాలోయింగ్ లైక్‌ల వరకు వెళ్లడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారా అని గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి. కాగా, మహిరా శర్మ 1997లో పుట్టింది. ఆమె ఫ్యామిలీ జుమ్మూ నుంచి ముంబయికి షిప్ట్ అయింది. బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది మహిరా శర్మ. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. తారక్ మెహ్తా కా ఉల్టా చెష్మాతో కెరీర్ ప్రారంభించింది. నాగిన్ 3, కుండలి భాగ్య, బెపానహ్ ప్యార్ వంటి టీవీషోలతో కాస్త గుర్తింపు తెచ్చుకుంది. బిగ్‌బాస్ 13తో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com