Gautam Adani : నేనూ ఫెయిలయ్యా.. జీవితం నాకు కొత్త దారి చూపింది!

Gautam Adani : నేనూ ఫెయిలయ్యా.. జీవితం నాకు కొత్త దారి చూపింది!
X

ఫెయిల్యూర్ అనేది చివరి గమ్యం కాదని, లైఫ్ మరో చాన్స్ తప్పకుండా ఇస్తుందంటున్నారు ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ. ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ లో మార్కులు తగ్గాయని, అనుకున్న పర్సంటైల్ రాలేదని ఉత్తర్ ప్రదేశ్లోని గోరఖ్ పుర్లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నఘటనపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. 'ఎన్నో ఆశలు పెట్టుకున్న కుమార్తె అంచనాల భారంతో ఇలా వెళ్లిపోవడం బాధాకరం. పరీ క్షల కన్నా జీవితం పెద్దది. తల్లిదండ్రులు ముందుగా దీన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని పిల్లలకు వివరించాలి. చదువులో నేనూ సాధారణ విద్యార్థినే. జీవితంలో చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. కానీ, ప్రతిసారీ జీవితం నాకు కొత్త దారి చూపించింది. మీ అందరికీ నా అభ్యర్థన ఒక్కటే. ఫెయిల్యూర్స్ ను ఫైనల్ డెస్టినేషన్ అనుకోవద్దు. జీవితం ఎప్పుడూ రెండో అవకాశం ఇస్తుంది' అని అదానీ ఎక్స్ పేర్కొన్నారు.

Tags

Next Story