Gold Prices : ఇరాన్ -ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ .. బంగారం భగభగ

X
By - Manikanta |13 Jun 2025 5:30 PM IST
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన యుద్ధం.. బంగారం ధరపై పడింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇవాళ పసిడి ధరలకు రెక్క లొచ్చాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఆల్ రికార్డు స్థాయికి ఎగబాకింది. ఇవాళ 1,00,403 రూపాయలుగా పలికింది. కిలో వెండి ధర రూ. 1,06,748గా ఉంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచిన విషయం తెలిసిందే. దీని ప్రభావం బులియన్ మార్కెట్ పై పడింది. ఇరాన్ అణు బాంబు పదార్థాల ఉత్పత్తిని ఆపడానికి ఓ వైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఇరాన్ లోని కీలకమైన అణు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది. దీంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై పడింది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com