IRCTC : తత్కాల్ బుకింగ్ టైమింగ్స్‌పై IRCTC క్లారిటీ

రైల్వేలో తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్ల బుకింగ్ టైమింగ్స్ మార్చారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని IRCTC స్పష్టం చేసింది. టికెట్ల బుకింగ్‌కు సంబంధించి టైమింగ్స్‌లో ఎలాంటి మార్పులు లేవని పేర్కొంది. ట్రైన్ బయలుదేరే ముందు రోజు తత్కాల్ బుకింగ్ చేసుకునేవారికి ఏసీకి సంబంధించి ఉ.10 గంటలకు, నాన్ ఏసీ క్లాస్‌కు సంబంధించిన ఉ.11 గంటలకు బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
తత్కాల్, ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ వేళలు ఏప్రిల్ 15 నుంచి మారతాయని, వీటికి వేర్వేరు సమయాలు ఇండియన్ రైల్వే కేటాయించినట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ఛానెళ్లలో వరుస పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. AC లేదా నాన్-AC తరగతులకు తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ బుకింగ్ సమయాలలో ప్రస్తుతం అలాంటి మార్పులేవీ జరగలేదని, రైల్వే టిక్కెట్ల నిబంధనల గురించి పూర్తి సమాచారం కోసం అధికారిక వనరులను మాత్రమే విశ్వసించాలని సూచించింది. ఈ మేరకు తత్కాల్, ప్రీమియం తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే సమయాలు మారలేదని క్లారిటీ ఇచ్చింది.
రైలు టికెట్లు బుక్ చేసుకునే IRCTC సైట్ ఈ మధ్యాహ్నం నుంచి మొరాయిస్తోందని పలువురు ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. సర్వర్ ప్రాబ్లమ్ వల్ల టికెట్ బుక్ చేసుకోలేకపోతున్నామని, చాలా ఇబ్బంది అవుతోందని చెబుతున్నారు. దీనిపై IRCTC ఇంకా స్పందించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com