Maharashtra : ఎన్సీపీలో చేరిన జిషాన్ సిద్దిఖీ

Maharashtra : ఎన్సీపీలో చేరిన జిషాన్ సిద్దిఖీ
X

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కుదుపు. ఎన్సీపీ పవార్‌ వర్గం నేత బాబా సిద్ధిఖీ కుమారుడు జిశాన్‌ సిద్ధిఖీ కూడా ఎన్సీపీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌లో టికెట్ దక్కకపోవడంతో అతను అజిత్‌ పవార్‌ వర్గంలో చేరినట్లుగా సమాచారం. ఎన్సీపీ తరఫున బాంద్రా ఈస్ట్‌ నుంచి జిశాన్‌ను బరిలో దింపుతున్నట్లుగా పార్టీ వెల్లడించింది. గతంలో జిశాన్‌ కాంగ్రెస్‌ టికెట్‌పై వంద్రే ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో పార్టీ ఆయన్ను బహిష్కరించింది. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి అతడికి టికెట్‌ దక్కలేదు.

జిశాన్‌ తండ్రి బాబా సిద్ధిఖీ కొద్దిరోజుల క్రితమే లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన ఎన్సీపీలో చేరడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్సీపీ పవార్‌ వర్గం అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించింది. ఇందులోను బాబా సిద్దిఖీ కుమారుడు జిశాన్‌కు బాంద్రా స్థానం నుంచి టికెట్‌ కేటాయించినట్లుగా ప్రకటించింది.

Tags

Next Story