Google Layoffs : గూగుల్ లో లేఆఫ్స్..?

Google Layoffs : గూగుల్ లో లేఆఫ్స్..?
X

గూగుల్ సంస్థలో లేఆఫ్ అమలు చేసినట్లు సమాచారం. క్లౌడ్ డివిజన్ లోని ఉద్యోగుల సంఖ్యను తగ్గించిందని అధికార వర్గాలు వెల్లడించినట్లు బ్లూమ్ బర్గ్ తన కథనంలో పేర్కొంది. అయితే ఎంతమందిని తొలగించిందనే విషయం మాత్రం తెలియరాలేదు. వంద మందికి పైగా ఉండొచ్చని, అది కూడా కొన్ని టీమ్స్ పై మాత్రమే తొలగింపుల ప్రభావం ఉందని తెలుస్తోంది. "కంపెనీ దీర్ఘకాలిక విజయాల కోసం వ్యాపారానికి కీలకమైన రంగాల్లో పెట్టుబడులు పెంచేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కొన్ని మార్పులు చేస్తున్నాం" అని గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా రానున్న రోజుల్లో అవకాశాల్ని అందిపుచ్చుకొనేందుకు అనేక సర్దుబాట్లు చేశామని వెల్లడించారు. మరోవైపు ఇటీవల త్రైమాసిక ఫలితాల్లో గూగుల్ తన క్లౌడ్ వ్యాపారంలో ఆదాయ అందుకోలేకపోయింది. 2025 మూలధన వ్యయాలు కూడా అంచనాలకు మించిపోయాయి. ఈనేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం గమనార్హం. టెక్ దిగ్గజం గూగుల్ బెంగళూరులో తమ కొత్త క్యాంపసు ప్రారంభించింది. దీనికి 'అనంత' అని పేరు కూడా పెట్టింది. అనంత అంటే 'అపరిమితం' అని అర్థం. ఇది టెక్నాలజీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అపరిమితమైన అవకాశాలను సూచిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న.. భారీ ఆఫీసులలో ఇది ఒకటని పేర్కొంది.

Tags

Next Story